నటుడు మోహన్ బాబుకు స్ట్రాంగ్ వార్నింగ్.. కారుతో ఇంట్లోకి దూసుకొచ్చి మరి..?
ఇంట్లో ఉన్న అందరూ ఒక్కసారిగా షాక్ కి గురయ్యారు. వెంటనే ఆ కారు నుంచి గుర్తుతెలియని దుండగులు గట్టిగా అరుస్తున్నారు. మిమ్మల్ని వదిలే ప్రసక్తే లేదు ప్రాణాలు తీస్తామని అంటూ హెచ్చరికలు చేస్తున్నారు. అటు వెంటనే కారును తిప్పి అక్కడి నుంచి వెళ్లిపోయారు గుర్తుతెలియని దుండగులు. దీంతో మోహన్ బాబు కుటుంబ సభ్యులు ఒక్కసారిగా షాక్ కి గురయ్యారు. వెంటనే అప్రమత్తమైన కుటుంబ సభ్యులు పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్ లో ఈ ఘటనపై ఫిర్యాదు చేశారు. ఆ కారు ఇంటిలోపలికి అకస్మాత్తుగా దూసుకు వచ్చిన సమయంలో.. ఇంటి వాచ్ మెన్ అప్రమత్తంగా లేనట్లు సమాచారం.
ఏపీ31 ఏఎస్0004 నెంబర్ గల ఇన్నోవా వాహనంలో నలుగురు వ్యక్తులు ఇంట్లోకి కారుతో దూసుకు వచ్చి నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు మోహన్ బాబు కుటుంబ సభ్యులు. అయితే సదరు గుర్తు తెలియని దుండుగులు మోహన్ బాబు కుటుంబానికి ఎందుకు హాని తలపెట్టాలని అనుకుంటున్నారు అన్నది ప్రస్తుతం ఎంతో సంచలనంగా మారింది.. ఇది కావాలని ఎవరైనా మోహన్ బాబు కుటుంబంతో శత్రుత్వం ఉన్నవారు చేసిన పనా.. లేకపోతే ఆకతాయిలు చేసిన పనా అనే కోణంలో ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. కాగా ఆ వాహనం నెంబర్ ప్రకారం ఆ కారు విజయ లక్ష్మి అనే మహిళ పేరు పై రిజిస్టర్ అయి ఉన్నట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. దీనిపై వివిధ కోణాల్లో విచారణ జరుపుతున్న పోలీసులు త్వరలోనే నిందితులను పట్టుకుంటామని హామీ ఇచ్చారు.Powered by Froala Editor