పవన్ కళ్యాణ్ సినిమా టీజర్ ఎప్పుడు విడుదలవనున్నదో తెలుసా..?

Suma Kallamadi
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న వకీల్ సాబ్ చిత్రం ఈ ఏడాదిలోనే విడుదల చేయాలని చిత్రబృందం భావిస్తోంది. పవన్ కళ్యాణ్ కూడా తన వకీల్ సాబ్ చిత్ర షూటింగ్ ని త్వరగా పూర్తిచేసి ఈ సంవత్సరంలోనే విడుదల చేసేందుకు శతవిధాల ప్రయత్నిస్తున్నాడు. అయితే ఈ సినిమా చిత్రీకరణ పూర్తవ్వగానే టీజర్ విడుదల అవ్వనున్నట్లు సమాచారం అందుతుంది. ఈ టీజర్ పవన్ కళ్యాణ్ 49 వ పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేసేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారట చిత్రబృందం.

సెప్టెంబర్ 2వ తేదీన పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు కాగా... అతని అభిమానులు 50 రోజుల ముందు నుండే అతని పుట్టిన రోజు ని జరుపుకుంటున్నారు. ఇప్పటికే సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ వీరాభిమానులు అతడి ఫోటోలను, వీడియోలను పోస్ట్ చేస్తూ పెద్ద దుమారమే రేపుతున్నారు. అయితే ఇటువంటి అభిమానులను ఇంకా ఎక్కువగా సంతోషపరచడానికి పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా వకీల్ సాబ్ చిత్రానికి సంబంధించిన టీజర్ తో పాటు అతని 27 వ చిత్రమైన విరూపాక్షకి సంబంధించిన ఫస్ట్ లుక్ ని విడుదల చేసేందుకు చిత్ర బృందాలు సన్నాహాలు చేస్తున్నాయి. ఒకవేళ ఇదే గనుక జరిగితే సోషల్ మీడియా సైట్లు పవన్ కళ్యాణ్ ఫోటో లతో, వీడియోలతో నిండిపోతాయి.

జనవరి, ఫిబ్రవరి నెలల్లో పవన్ కళ్యాణ్ రూపొందించుకున్న ప్రణాళికలు కరోనా వైరస్ కారణంగా చెడిపోయాయి. మళ్లీ సినిమాల కోసం,  రాజకీయాల కోసం కొత్త ప్రణాళికను రూపొందించుకుంటున్నాడు పవన్ కళ్యాణ్. కానీ రోజులు గడుస్తున్న కొద్దీ భారత దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి విపరీతంగా పెరిగిపోతోంది. వైరస్ నియంత్రణలో ఉంచడానికి అనేక ప్రాంతాల్లో లాక్ డౌన్ కూడా విధించబడుతుంది. మరి ఇటువంటి పరిస్థితులలో పవన్ కళ్యాణ్ సినిమాలు అనుకున్నట్టు విడుదల అవుతాయో లేదో తెలియాలంటే వేచి చూడాల్సిందే.Powered by Froala Editor

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: