సమంత అక్కినేని నాగచైతన్యని ఎప్పుడు ఘాడంగా ప్రేమించడం ప్రారంభించిందో తెలుసా..?

Suma Kallamadi

తమిళనాడులోని మద్రాసులో ప్రభు, నినెట్టే దంపతులకు 1987 ఏప్రిల్ 28న సమంత జన్మించింది. బీకాం చదువుతున్న రోజుల్లోనే సమంత మోడలింగ్ ప్రపంచంలో రంగప్రవేశం చేసింది. ఆ సమయంలోనే డైరెక్టర్ గౌతమ్ మీనన్ సమంత ఫోటోలను చూసి ఆమెను తన సినిమాకి ఎంపిక చేసుకున్నాడు. అప్పటికే నాగచైతన్యతో కొన్ని సన్నివేశాలను కూడా చిత్రీకరించాడు. సమంత సినిమాల్లో నటించేందుకు అంగీకరించగానే పూర్తి స్థాయిలో తమిళం తెలుగు భాషలలో ఏ మాయ చేసావే సినిమాని చిత్రీకరించడం ప్రారంభించాడు గౌతమ్ మీనన్. ఆ సమయంలోనే నాగచైతన్య సమంత డేటింగ్ చేసుకోవడం ప్రారంభించారు. 


ఈ సినిమాలో నటిస్తున్న సమయంలోనే సమంతకు బృందావనం సినిమాలో సెకండ్ హీరోయిన్ గా చాన్స్ వచ్చింది. దాంతో ఆమె అంగీకరించి ఆ సినిమా చిత్రీకరణలో కూడా పాల్గొనేది. ఏ మాయ చేసావే సినిమా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది. నాగ చైతన్య సరసన మలయాళ క్రిస్టియన్ అమ్మాయిగా నటించిన సమంతకు ఎనలేని ప్రేక్షకాదరణ తో పాటు ఉత్తమ డెబ్యూ నటీమణిగా ఫిలింఫేర్ అవార్డు, నంది అవార్డు కూడా ఆమెకు లభించింది. నాగచైతన్య సమంతా కెమిస్ట్రీ బాగా పడిందని చెప్పుకోవచ్చు. ఆ తర్వాత ఆమె దూకుడు సినిమాలో మహేష్ బాబు సరసన నటించి మంచి నటీమణిగా పేరును దక్కించుకుంది.


2012వ సంవత్సరంలో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో మళ్లీ మహేష్ బాబు సరసన నటించి తన పాపులారిటీ తారా స్థాయికి తీసుకెళ్లింది. అదే సంవత్సరంలో రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈగ సినిమాలో హీరో నాని తో జతకట్టింది. వాస్తవానికి ఈ సినిమాలో నాని పాత్ర కొంత సమయం మాత్రమే ఉంటుంది. నాని చనిపోయిన తర్వాత సమంత ఒక్కటే ఈ సినిమా చివరి వరకూ తన భుజాలపై వేసుకొని నడిపిస్తుంది. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ గా నిలవడానికి సమంత అక్కినేని నటనా చాతుర్యం కీలకమైన పాత్ర వహించింది అని చెప్పుకోవచ్చు. ఈగ చిత్రంలో ఈమె నటనకు గాను ఉత్తమ నటీమణి గా ఫిలింఫేర్ అవార్డు కూడా లభించింది. 


ఆ తర్వాత తమిళ, తెలుగు సినిమాలలో నటించిన సమంత అక్కినేని ఎన్నో హిట్స్ సాధించింది. 2014వ సంవత్సరంలో ఆటోనగర్ సూర్య చిత్రీకరణ సమయంలో సమంత, నాగచైతన్య ఘాడంగా ప్రేమించుకోవడం ప్రారంభించారు. మూడు సంవత్సరాల తర్వాత అనగా 2017 జనవరి 19న హైదరాబాద్ నగరంలో ఒక ప్రైవేటు వేడుకలలో (సెరిమోనీ) లో కుటుంబ సభ్యుల సమక్షంలో నాగచైతన్య సమంత నిశ్చితార్థం జరిగింది. తొమ్మిది నెలల తర్వాత అనగా అక్టోబర్ 6, 2017న 11:52 నిమిషాలకు హిందూ సాంప్రదాయం ప్రకారం నాగచైతన్య సమంత వివాహం చేసుకున్నారు. అక్టోబర్ 7వ తేదీన క్రిస్టియన్ ఆచారాల ప్రకారం వీళ్లిద్దరు మళ్లీ పెళ్లి చేసుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: