సుశాంత్ సింగ్ ఆత్మహత్య చేసుకోవడానికి కారణం ఆమెతో బ్రేకప్ అవ్వడమేనా... స్నేహితుడు ఏం చెప్పాడంటే..?
ఇండియన్ క్రికెట్ కెప్టెన్ ఎంఎస్ ధోని జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన ఎం.ఎస్. ధోనీ: ది అన్టోల్డ్ స్టోరీలో ధోని పాత్రలో నటించిన సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఈ రోజున ముంబైలోని తన బాంద్రా నివాసంలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. జూన్ 9వ తారీఖున సుశాంత్ సింగ్ మేనేజర్ దిశ సలియాన్ పెద్ద భవనం పై నుండి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఆమె ఆత్మహత్య వేసుకున్న తర్వాత కేవలం అయిదు రోజుల వ్యవధిలోనే సుశాంత్ సింగ్ ఆత్మహత్య చేసుకోవడం ప్రస్తుతం అనేక అనుమానాలకు దారి తీస్తోంది.
ఒక్కసారి గతంలోకి తొంగి చూస్తే చిన్న చిన్న టీవీ సీరియల్స్ లలోని పాత్రలలో నటిస్తూ టాప్ హీరో స్థాయికి ఎదిగిన సుశాంత్ సింగ్ జీవితంలో ఎన్నో చేదు అనుభవాలు చోటుచేసుకున్నాయని తెలుస్తుంది. తన కో యాక్టర్ అంకిత లోఖండే ని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు కానీ ఏవో కారణాల వల్ల వారిద్దరూ విడిపోయారు. ఈ విడాకులు అతని మానసిక పరిస్థితి పై ప్రభావం చూపిందని చెప్పుకోవచ్చు. అతడు చాలా సున్నితమైన వ్యక్తి (సెన్సిటివ్ పర్సన్) అని సోషల్ మీడియాలో తాను పెట్టే పోస్టులు చెప్పకనే చెబుతాయి. గత కొన్ని నెలలుగా తను డిప్రెషన్ కి బాగా లోనయ్యి ఒంటరిగానే జీవిస్తున్నాడు అని సన్నిహిత వర్గాల నుండి తెలుస్తుంది. దానికి తోడు తాను నటించిన సినిమాలన్నీ పరాజయం పొందాయి. రేఖా చక్రవర్తితో కొంత కాలం డేటింగ్ చేసి ఆపై అతనికి ఆమెకి బ్రేక్ అప్ అవ్వడంతో తీవ్రమైన మనస్థాపానికి గురయ్యాడని మరికొంతమంది ప్రస్తావిస్తున్నారు.
తన మేనేజర్ ఆత్మహత్య చేసుకోవడం, కేవలం ఐదు రోజుల్లోనే తాను కూడా ఆత్మహత్య చేసుకోవడం ప్రస్తుతం ప్రతి ఒక్క భారతీయుడికి అర్థం కాకుండా ఉంది. సుశాంత్ సింగ్ తన ఇంస్టాగ్రామ్ చివరి పోస్ట్ లో తన తల్లిని ఎందుకు తలుచుకున్నాడో అని మరికొంతమంది చర్చించుకుంటున్నారు.
None can be better Choice You always live alive in Our hearts
RIP #SushantSinghRajput 💔🙏 pic.twitter.com/Nv591r6VPH — dhanush Rithik (@dhanush_rithik) June 14, 2020
ఏది ఏమైనా అతడు ఎంత గొప్ప నటుడో ధోనీ సినిమా చూసిన ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. అంతటి నటనా ప్రతిభ ఉన్న సుశాంత్ కేవలం 34 సంవత్సరాలకే ఆత్మహత్య చేసుకోవడం ప్రస్తుతం సినీ ప్రేక్షకులు జీర్ణించుకోలేకపోతున్నారు. సుశాంత్ తన జీవితంలో ఎంత బాధని అనుభవించాడో ఎవరికీ తెలియదు కానీ అకస్మాత్తుగా అందరినీ బాధ పెట్టి శాశ్వతంగా వెళ్లిపోవడం ప్రస్తుతం అందరి మనసులను కలచివేస్తోంది.
This Video Speaks a lot about His Character#ripsushant#ripsushantsinghrajput #SushantSinghRajput pic.twitter.com/7BH3Hhio2t — Rusthum (@RusthumHere) June 14, 2020
ఈ నేపథ్యంలోనే సుశాంత్ సింగ్ ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడని అనేక వార్తా సంస్థలు అతడి సన్నిహితులను, స్నేహితులను ఆరా తీస్తున్నాయి. ఇందులోని భాగంగానే అతని స్నేహితుడు ఫోన్ ద్వారా మాట్లాడుతూ... సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఉదయం పూట బాగానే ఉన్నాడని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ముంబై పోలీసులు సుశాంత్ బాంద్రా నివాసంలో ఏదైనా ఆధారాలు దొరుకుతాయేమోనని వెతుకుతున్నారు. కొన్ని రోజుల క్రితం సుశాంత్ పాట్నా లో నివాసముంటున్న తన తండ్రికి ఫోన్ చేసి పర్వతారోహణ చేద్దామని చెప్పినట్టు అతడి పనిమనిషి చెప్పింది. సుశాంత్ సింగ్ ని చూసేందుకు అక్క ముంబై ఆస్పత్రికి ఇప్పుడే చేరుకుంది.