ఇళయరాజా ఫేవరెట్ హీరోయిన్ ఎవరంటే

Gullapally Venkatesh

ఇళయరాజా... ఆయన కెరీర్ లో ఎందరో హీరోలు ఎందరో హీరోయిన్ లు ఇలా ఎందరి తోనో ఆయన పని చేసి ఉంటారు. ఆయన సంగీతం కోసం ఎందరో ముందుకు వచ్చి ఆయన తో సినిమా చేయడానికి ఆసక్తి చూపించే వారు. అలాంటిది ఆయన స్వయంగా కొందరు హీరోయిన్ ల కోసం తానే సంగీతం అందిస్తా అని ముందుకు వచ్చిన సందర్భాలు ఉన్నాయి అంటారు చాలా మంది. అవును ఆయనకు కొందరు హీరోయిన్ లకు  సంగీతం అందించాలి అంటే చాలా ఇష్టం అని అందుకే ముందుకు వస్తు ఉండే వారు అని అంటారు. ఆయన కెరీర్ లో చాలా మంది హీరోయిన్ లతో ఆయన పని చేసారు. 

 

అయితే ఆయన ప్రత్యేకంగా అభిమానించిన హీరోయిన్ సుహాసిని. ఆమెకు తగిన విధంగా అయన సంగీతం అందించారు. ఆమె నవ్వు అంటే ఆయనకు చాలా ఇష్టం అని ఆయన అందుకే ఆమెకు చాలా వరకు పాటలు అందించారు అని అంటారు. ఆమె హీరోయిన్ అని చెప్తే చాలు ఏ భాష లో అయినా సరే ఆయన సినిమా చేయడానికి ముందుకు వచ్చిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి అని అంటారు. ఆమె కూడా ఆయన ఆలోచనకు తగిన విధంగానే నటించే వారట. చాలా సందర్భాల్లో ఆమె గురించి ఆయన చెప్పే వారు. ఇక ఆమె భర్త తో కూడా ఆయనకు చాలా మంచి సంబంధాలు ఉన్నాయి. 

 

ఇక వారి కుటుంబం లో ఆయన కూడా ఒక సభ్యుడు అనేది చాలా మంది చెప్పే మాట. ఆ విధంగా ఆయన ప్రభావం చూపించే వారు. ఆమె గురించి ఆయన చాలా సందర్భాల్లో చెప్పారు కూడా. ఆమె కూడా ఆయన గురించి మాట్లాడుతూ ఉంటారు. ఆ విధంగా ఈ కాంబినేషన్ అటు తమిళంలో ఇటు తెలుగులో పాపులర్ అయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: