బన్నీ డ్యాన్స్ కి షాహిద్ ఫిదా ...!

Suma Kallamadi

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్.... ఈయన గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. ప్రస్తుతం ఈయన క్రేజ్  క్రమక్రమంగా రాష్ట్ర హద్దులు కూడా దాటేస్తుంది. ఇక తెలుగు ఇండస్ట్రీలో తిరుగులేని స్టార్ అనే చెప్పాలి. అంతేకాకుండా మలయాళంలో కూడా అల్లు అర్జున్ కు మంచి క్రేజ్ ఉంది.ఈ సంవత్సరం సంక్రాంతికి విడుదలైన అలా వైకుంఠపురం సినిమా విజయం సొంతం చేసుకోవడంతో తిరుగులేని స్టార్ అయ్యాడు. ప్రస్తుతం అల్లు అర్జున్ మరో విభిన్న ప్రయోగానికి సిద్ధం అయ్యాడు అని తెలుసు కదా.. 


తన తర్వాతి చిత్రం సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ ఎర్రచందనం స్మగ్లింగ్ తరుణంలో ఒక సినిమాని తీసేందుకు సిద్ధమయ్యాడు. ఇటీవలే అల్లు అర్జున్ బర్త్ డే రోజున టైటిల్ ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా విడుదల చేయడం జరిగింది. ఈ సినిమాకి " పుష్ప " అనే టైటిల్ కూడా ఖరారు చేశారు. ఇక బన్నీలో మరొక ప్రత్యేకత ఏమిటి అంటే డాన్స్ లో అద్భుతమైన నటన ఇస్తాడు. ఇక అలా వైకుంఠపురంలో సినిమాలో అల్లు అర్జున్ " బుట్ట బొమ్మ బుట్ట బొమ్మ సాంగ్ " కు వేసిన స్టెప్పులని ఇప్పుడు సెలబ్రిటీలు అంతా ఫాలో అవుతున్నారు అంటే నమ్మండి. 
 

ఏకంగా బాలీవుడ్ మెరుపుతీగ దిశాపటాని కూడా అల్లు అర్జున్ కి ఈ డాన్స్ ఎలా సాధ్యం అని అడిగేసింది. ఈ తరుణంలోనే మరో క్రేజీ బాలీవుడ్ హీరో బన్నీ డాన్స్ పై కామెంట్ చేయడం జరిగింది. ఆ హీరో ఎవరో అనుకుంటున్నారా షాహిద్ కపూర్.. ఇటీవల తరుణంలో అందరూ ఇళ్లకే పరిమితం కావడంతో సోషల్ మీడియాలో ముచ్చట చేస్తున్న సందర్భంలో అల్లు అర్జున్ గురించి అడగడం జరిగింది దీనికి షాహిద్ కపూర్ బన్నీ డాన్స్ అంటే నాకు చాలా ఇష్టం అని ట్విట్టర్ సంభాషణలో తెలియజేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: