‘ఓ మై గాడ్’ వెనుక ఉహకందని ట్విస్ట్ !

Seetha Sailaja
ఈ సంవత్సరపు టాలీవుడ్ సంచనలన చిత్రంగా రాబోతున్న పవన్ వెంకీల ‘ఓ మై గాడ్‌' వెనుక ఉహకందని ట్విస్ట్ ఉందని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. ఈ సినిమా రీమేక్‌లో పవన్‌కళ్యాణ్‌, వెంకటేష్‌ నటించబోతున్నారని స్వయంగా ఆ సినిమా నిర్మాతల నుంచే ప్రెస్‌నోట్‌ వచ్చింది.  చాలా కాలంగా వెంకటేష్‌ చేయకుండా పెండింగ్‌లో పెట్టిన ఈ రీమేక్‌ ఇక రియాలిటీగా మారడం ఖాయం అనుకుంటూ ఉండగా ఈ సినిమాలో మహేష్ గొంతు, చరణ్ స్పెషల్ సాంగ్ కూడా ఉంటుంది అని వార్తలు రావడంతో ఈ సినిమా పై మరింత క్రేజ్ పెరిగింది. అయితే ముందుగా వెంకటేష్ ఈ సినిమా కంటే కూడా తన ‘దృశ్యం’ రీమేక్ ను ముందు పట్టాలు ఎక్కిస్తాడు అనే వార్తలు వస్తున్నాయి.  మరోవైపు పవన్‌ తన సోలో సినిమాకి పూజ చేయించాడు. మరి ఈ ఇద్దరూ కలిసి నటించే ‘ఓ మై గాడ్‌’ సంగతేంటి? ఇంకా ఈ కథకి మరమ్మత్తులు చేయిస్తున్నారా లేకఈ హీరోలిద్దరూ మరోసారి ఆలోచించుకుంటున్నారా? అనే వార్తలు ఫిలింనగర్ లో వినపడుతున్నాయి. ఎందుకంటే పవన్‌, వెంకీలు ఈ సినిమా చేస్తున్నారంటే ఎక్సయిట్‌మెంట్‌ కంటే 'ఎందుకిది' ఈ ప్రయోగం అంటున్న వారు సంఖ్య కూడా ఎక్కుగానే ఉంది. ఈ నేపథ్యంలో ఈసినిమాకు ఉహకందని ట్విస్ట్ ఉన్నాదా అనే వార్తలు కూడ ఫిలింనగర్ హడావిడి చేస్తున్నాయి.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: