బికినీలో దీపికా పదుకొనే హాట్ ఫొటో షూట్..

Murali

హిందీ సినిమాల్లో అగ్రస్థానంలో కొనసాగుతున్న దీపికా పదుకొనే గ్లామర్ క్వీన్ గా ఎంతటి పేరు ప్రఖ్యాతులు సంపాదించిందో తెలిసిన విషయమే. 2007లో వచ్చిన ఓం శాంతి ఓం సినిమాలో హీరోయిన్ గా పరిచయమైన నాటి నుంచి ఆమె వెనుతిరిగి చూసింది లేదు. బాలీవుడ్ అగ్రశ్రేణి కథానాయికగా ఎన్నో హిట్ సినిమాల్లో నటించింది. గ్లామర్ కు పర్యాయపదంలా ఉండే దీపిక ప్రముఖ ఫ్యాషన్ మాస పత్రిక ఎల్లె ఇండియాకు ఇచ్చిన ఫోటో షూట్ సెగలు రేపుతోంది. దీపిక గ్లామర్ డోస్ రేంజ్ ఎంటో ఈ ఫొటో షూట్ చూస్తే అర్ధమవుతోందనే చెప్పాలి.

 

సముద్రం కెరటాలకు ఎదురుగా లేత రంగు ట్రాన్స్ పరెంట్ డ్రెస్ లో దీపిక ఇచ్చిన స్టిల్ కుర్రకారు మతులు పోగొడుతోందనే చెప్పాలి. ట్రాన్స్ పరెంట్ గౌనులో దీపికకు తప్ప మరెవరికీ ఆ డ్రెస్ సరిపోదా.. లేక అటువంటి లేత పొరల డ్రెస్సింగ్ ను దీపిక తప్ప మరెవరూ వేయలేరు అన్నట్టుగా ఉంది. దీనికి తోడు ట్రాన్స్ పరెంట్ గౌనులో దీపిక వేసిన బికినీలో సెక్సీనెస్ ఓవర్ లోడెడ్ అన్నట్టు ఉంది. సముద్రపు నీటికి, దీపిక వేసిన డ్రెస్సింగ్ కలర్ కూడా మ్యాచ్ అయింది. దీంతో ఎంతో వయ్యారంగా దీపిక ఇచ్చిన స్టిల్ చాలా సెక్సీగా ఉంది.

 

 

రణవీర్ సింగ్ తో పెళ్ల జరిగినా దీపికలో అందం ఏమాత్రం తగ్గలేదు. సోషల్ మీడియాలో దీపిక అందానికి ఆమె ఫ్యాన్స్ నుంచి కాంప్లిమెంట్స్ వస్తున్నాయి. ‘సాగరకన్యలా ఉన్నావు’, ‘ఇంత అందం మన సినిమాల్లో ఉండటం అదృష్టం’, ‘స్టన్నింగ్ బ్యూటీ’, ‘సముద్రమంత అందం దీపిక సొంతం’, అంటూ ఆమె అందానికి నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. ప్రస్తుతం దీపిక 83 మూవీలో రోమి దేవ్ పాత్ర పోషిస్తోంది. రణవీర్ సింగ్ కపిల్ దేవ్ పాత్రలో నటిస్తున్నాడు.

 
 
 
 
auto 12px; width: 50px;"> 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
Soaking it all in🏖️ . On @deepikapadukone: Tulle dress, @amitaggarwalofficial. Sterling {{RelevantDataTitle}}