అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్నాడనుకున్నారు.. కానీ..
ప్రస్తుత కాలంలో ఎక్కడ చూసిన వార్తల్లో ప్రేమ అనే పదం బాగా వినిపిస్తోంది. ఈ మధ్య కాలంలో బలవర్మరణలు ఎక్కువ అయిపోయాయి. అమ్మాయి తన ప్రేమను ఒప్పుకోకపోతే ఆత్మహత్య, ఆమె తనను కాదంటే ఆత్మహత్య.. ఇలా చిన్న చిన్న కారణాలతో వారు వారి జీవితాల్ని నాశనం చేసుకుంటున్నారు. అలా వారి ఒక్కరి
జీవితమే కాక.. వారిపై ఆధారపడ్డ కుటుంబసభ్యులను రోడ్డున పడేస్తున్నారు.
తాజాగా ఓ ప్రేమికుడు తమ ప్రేమ విఫలం కావడంతో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన తూర్పు గోదావరి జిల్లా సామర్లకోటలో వెలుగుచూసింది. మండలంలోని వేట్లపాలెం పంచాయతీ పరిధిలోని హరిజనపేటకు చెందిన బర్రె శేఖర్ కొంత కాలంగా ఓ యువతిని ప్రేమిస్తున్నాడు. సోమవారం అతడు మేడపాటు సమీపంలో రైలు పట్టాలపై విగత జీవిగా కనిపించడంతో a యువకుని కుటుంబసభ్యులు షాకయ్యారు.
అయితే.. గతంలో శేఖర్ ఓ ప్రైవేటు సంస్థలో ఉద్యోగం చేసేశాడు. ఇటీవల ఫైనాన్స్ పై బైక్ కొన్నాడు. కొద్దిరోజుల క్రితం ఉద్యోగం పోవడంతో బైన్ లోన్ ఈఎంఐలు కట్టలేకపోతున్నాడు. ఆ మనస్తాపంతోనే శేఖర్ ఆత్మహత్య చేసుకుని ఉంటాడని కుటుంబ సభ్యులు భావించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఆ కేసును పరిశీలిస్తుండగా తాను ప్రేమ వ్యవహారంతో చనిపోయాడని తెలుసుకున్నారు.
అయితే పోలీసులు అతడి ఫోన్ పరిశీలించగా ప్రేమ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. నువ్వంటే నాకు చాలా ఇష్టం.. నువ్వు లేకుండా నేను ఉండలేను. నిన్ను వేరొకరితో ఊహించుకోలేను. మరో జన్మ ఉంటే కలుసుకుందాం. సుఖంగా ఉండు, నిన్ను కష్టపెట్టకూడదనే నేను వెళ్లిపోతున్నా.. అంటూ శేఖర్ టిక్ టాక్ వీడియోలు చేశాడు. అయితే శేఖర్ ప్రేమించిన అమ్మాయి ఎవరా? అన్న దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. శేఖర్ ఆత్మహత్యతో అతడి కుటుంబసభ్యులు, స్నేహితులు, బంధువులు శోక సంద్రంలో మునిగిపోయారు.