ప్రతిరోజూ పండగే : మెగా హీరో భలే సన్నబడ్డాడే ?

Reddy P Rajasekhar

మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ హీరోగా రాశీఖన్నా హీరోయిన్ గా మారుతీ దర్శకత్వంలో తెరకెక్కిన ప్రతిరోజూ పండగే సినిమా ఈరోజు విడుదలైంది. కెరీర్ మొదట్లో వరుస హిట్లతో గుర్తింపు తెచ్చుకున్న సాయి ధరమ్ తేజ్ గత కొంతకాలంగా సరైన హిట్లు లేక ఫ్లాపులతో సతమవుతున్నాడు. సాయి ధరమ్ తేజ్ నటించిన చివరి సినిమా చిత్రలహరి పరవాలేదనిపించుకోవటంతో సాయి ధరమ్ తేజ్ కు నిరాశే మిగిలింది. 
 
భారీ అంచనాలతో కుటుంబ కథా చిత్రంగా తెరకెక్కిన ప్రతిరోజూ పండగే సినిమాకు ప్రేక్షకుల నుండి హిట్ టాక్ వినిపిస్తోంది. మెగా హీరో సాయి ధరమ్ తేజ్ గత సినిమాలతో పోలిస్తే ఈ సినిమాలో సన్నబడ్డాడు. సన్నబడిన సాయి ధరమ్ తేజ్ ఈ సినిమాలో సిక్స్ ప్యాక్ లో కనిపించాడు. క్లైమాక్స్ కు ముందు వచ్చే సన్నివేశాల్లో సిక్స్ ప్యాక్ ఫైట్ సీన్ బాగుంది. సాయి ధరమ్ తేజ్ గతంతో పోలిస్తే బాగా బరువు తగ్గడంతో ఈ సినిమాలో కొత్త లుక్ లో కనిపిస్తున్నాడు. 
 
సాయి ధరమ్ తేజ్ కు ఈ లుక్ బాగా సూట్ అయిందని సన్నబడిన సాయి ధరమ్ తేజ్ బాగున్నాడని అభిమానుల నుండి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రధానంగా కామెడీ, ఎమోషన్స్ పై దృష్టి పెట్టిన ఈ సినిమాలో సాయి ధరమ్ తేజ్ రాశీఖన్నా మధ్య వచ్చే కామెడీ సన్నివేశాలు బాగున్నాయి. సత్యరాజ్, రావురమేష్ పాత్రలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. థమన్ సంగీతం, నేపథ్య సంగీతం బాగుంది. 
 
కుటుంబ కథా చిత్రంగా తెరకెక్కిన ప్రతిరోజూ పండగే సినిమా కీలకమైన ఎమోషన్స్ పండటంతో పాటు కామెడీ బాగానే ఉండటంతో అబవ్ యావరేజ్ సినిమాగా నిలిచే అవకాశం ఉంది. దర్శకుడు మారుతీ ప్రధానంగా కామెడీపైనే దృష్టి పెట్టగా నెమ్మదిగా సాగే స్క్రీన్ ప్లే సినిమాకు కొంత మైనస్ గా మారింది. ప్రతిరోజూ పండగే సినిమాకు పోటీగా విడుదలైన రూలర్ సినిమాకు నెగిటివ్ టాక్ రావటంతో ఈ వీకెండ్ కుటుంబ కథా చిత్రాలు ఇష్టపడేవారికి ప్రతిరోజూ పండగే సినిమా ఫస్ట్ ఆప్షన్ గా నిలిచే అవకాశం ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: