ఆ స్టార్ హీరో.. ఇంట్లో పాములు పెంచుతున్నారా.?

praveen

మామూలుగా అయితే ఎవరైనా ఇంట్లో పిల్లల్ని పెంచుకుంటారు కుక్కల్ని పెంచుకుంటారు... కానీ ఎవరైనా పాములు పెంచుకోవడం విన్నారా. ఇంట్లో పాములను ఎవరు పెంచుకుంటారు అంటారా.. ఇక్కడ ఓ వ్యక్తి పెంచుకుంటున్నారు. అది కూడా ఓ హీరో. ఇంతకీ ఆ హీరో ఎవరు అనుకుంటున్నారా తమిళ స్టార్ హీరో అజిత్. కాగా గత కొంత కాలంగా తమిళ స్టార్ హీరో అజిత్ తన ఇంట్లో పాములను పెంచుకుంటున్నారు అంటూ వార్తలు వస్తున్నాయి. తమిళ హీరో తో పాటు అజిత్ మేనేజర్ సురేష్ చంద్ర కూడా తన ఇంట్లో మూడు అడుగుల పొడవైన పాములు పెంచుతున్నారు  అంటూ వార్తలు తెరమీదకు వచ్చాయి. ప్రస్తుతం తమిళ ఇండస్ట్రీలో ఈ వార్తలు హాట్ టాపిక్ గా మారాయి. ఇక ఈ విషయం కాస్తా అటవీ శాఖ  వరకు చేరడంతో... అటవీశాఖ అధికారులు అజిత్ ఇంట్లో సోదాలు చేశారు దీంతో అలాంటిదేమీ లేదని తెలిసింది.

 

 

 కానీ అజిత్ మేనేజర్ ఇంట్లో మాత్రం పాములు పెంచుకుంటున్నారని మరో వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. మూడు అడుగుల పాము అజిత్ మేనేజర్ సురేష్ చంద్ర పెంచుకుంటున్నారని... ఆ పాముకి రోజూ ఎలుకలను ఆహారంగా ఇస్తూ పామును పెంచుతున్నారు అంటూ సోషల్ మీడియాలో వార్తలు హల్ చల్ చేశాయి. అయితే అటవీ శాఖ అధికారులకు అజిత్ మేనేజర్ సురేష్ చంద్ర చిరునామా తెలియకపోవడంతో... మొదటగా తిరువాన్మియూర్ లోని అజిత్ నివాసానికి వెళ్లి అటవీశాఖ అధికారులు అజిత్ మేనేజర్ సురేష్ చంద్ర చిరునామాను తెలుసుకున్నారు. దీంతో వెంటనే అజిత్ మేనేజర్ సురేష్ చంద్ర ఇంటికి చేరుకున్న అటవీశాఖ అధికారులు అతన్ని విచారించి పామును పెంచుతున్నారా లేదా అన్నది ఆరా తీస్తున్నారు. 

 

 

 ఈలోగా అజిత్ ఇంట్లో పాములు పెంచుతున్నారు  అంటూ అటవీశాఖ అధికారులు హీరో అజిత్ ఇంటిపై రైడ్ చేశారని సోషల్ మీడియాలో వార్తలు హల్ చల్ చేశాయి. అయితే అజిత్ ఇంట్లో దాడి జరగలేదని కానీ మేనేజర్ సురేష్ చంద్ర పై మాత్రం అటవీ శాఖ అధికారులు ఒక కన్నేసి ఉంచారు అంటూ సమాచారం వస్తుంది. హీరో అజిత్ ఈ వార్తలపై స్పందించారు తన ఇంట్లో అలాంటి దాడి ఏమీ జరగలేదని అసలు తన ఇంట్లో పాములు  లేవు అని చెబుతున్నాడు. మొత్తానికి అయితే హీరో అజిత్ ఇంట్లో పాములు ఉన్నాయని..  అటవీశాఖ అధికారులు అజిత్ ఇంటిపై దాడి చేశారు అంటూ సోషల్ మీడియాలో వార్తలు రావడంపై తమిళనాట వైరల్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: