దశాబ్ద కాలంలో కాంట్రవర్సికి దూరంగా ప్రేక్షక దేవుళ్ళ మనస్సుకు దగ్గరగా సూపర్ స్టార్ విజయ విహరం !
ఆనాటి కాలంలో కృష్ణ హీరోగా ఎంతటి ఘనత సాధించారు అందరికీ తెలిసిన విషయమే. ఎన్నో ఏళ్లుగా తెలుగు చిత్ర పరిశ్రమలో నెంబర్ వన్ హీరోగా కొనసాగారు సూపర్ స్టార్ కృష్ణ. ఈనాటి కాలానికి ఘట్టమనేని కృష్ణ వారసుడిగా తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమయ్యారు రాజకుమారుడు లాంటి మహేష్ బాబు.బాలనటుడిగానె సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకులను అప్పట్లోనే మెప్పించాడు మహేష్ బాబు. రాజకుమారుడు సినిమా తో టాలీవుడ్కు హీరోగా ఎంట్రీ ఇచ్చి అంచెలంచెలుగా ఎదిగారు మహేష్ బాబు. కెరియర్ మొదటి నుంచే అతి తక్కువ మాట్లాడుతూ.. ఓ సాదాసీదా మనిషి లా అందరి మనసులు దోచుకున్నాడు మహేష్ బాబు. హంగు ఆర్భాటాలకు మహేష్ మొదటి నుంచి దూరం గానే ఉన్నాడు. వరుస సినిమాలు చేసుకుంటూ తండ్రికి తగ్గ తనయుడిగా టాలీవుడ్లో తనదైన ముద్ర వేసుకున్నాడు మహేష్ బాబు.
చిత్ర పరిశ్రమకు హీరోగా పరిచయమై ఎన్నో సంవత్సరాలు అవుతున్నప్పటికీ మహేష్ బాబు ఒక్క కాంట్రవర్సీలో లేరు అనడంలో అతిశయోక్తి లేదు. కాంట్రవర్సీ లకు దూరంగా ప్రేక్షక దేవుళ్ళకు దగ్గరగా సినిమాలను చేస్తూ ఎంతోమంది ప్రజల అభిమానాన్ని కూడగట్టుకున్నారు మహేష్ బాబు. మహేష్ బాబు అంటే ఒక మంచి మనిషి... హంగు ఆర్భాటాలకు దూరంగా ఉంటూ సూపర్ స్టార్ అయినప్పటికీ ఒక సాదాసీదా మనుశిలా ... అతి తక్కువగా మాట్లాడుతూ... కాంట్రవర్సీ లకు కిలోమీటర్ దూరం ఉంటూ వరుస విజయాలను సొంతం చేసుకుంటూ... దూసుకుపోతున్న హీరో ఒక్క మహేష్ బాబు మాత్రమే అని ప్రతి ప్రేక్షకుడు అనుకుంటున్న మాట.
తన సినిమాలో కాంట్రవర్సీలు సృష్టించడం తన పద్ధతి కాదు కేవలం ప్రేక్షక దేవుళ్లను అలరించటం మాత్రమే తన సినిమాలు నేపథ్యం అనుకుంటూ సినిమాలు చేస్తున్నాడు. గత దశాబ్ద కాలంగా మహేష్ బాబు చేసిన సినిమాలు చూస్తుంటే ఎవరికైనా అదే అనిపిస్తుంది. మొదటి నుంచి ఇదే పంథా తో కొనసాగుతూ తెలుగు ప్రేక్షకులందరికి సూపర్ స్టార్ గా విజయవిహారం చేశాడు మహేష్ బాబు. ఇక మహేష్ బాబు నటించిన ఎన్నో సినిమాలు సంచలన విజయాలను నమోదు చేశాయి. ఇక ఇప్పుడు విభిన్నమైన కథలు ఎంచుకుంటూ.. తన సినిమాలతో అభిమానులు అందరూ సైతం సమాజానికి ఉపయోగపడే మార్చే విధంగా సినిమాలను చేస్తూ... మంచి విజయాలను అందుకుంటూ దూసుకుపోతున్నారు మహేష్ బాబు . ప్రస్తుతం టాలీవుడ్ నెంబర్ వన్ హీరో గా కొనసాగుతున్నారు ఘట్టమనేని వారసుడు మహేష్ బాబు