వెంకటేష్‌కి ఈ బర్త్‌డే వేరీ స్పెషల్ ఎందుకంటే?
తండ్రి కలను నిజం చేస్తూ హీరోగా అంచలంచెలుగా ఎదుగుతూ వచ్చిన వెంకటేష్ తన జనరేషన్లో టాప్ స్టార్స్ నలుగురిలో ఒకరిగా రాణించాడు. తన ఇమేజ్, బాడీ లాంగ్వేజ్‌కు తగ్గ పాత్రలను ఎంచుకుంటూ వరుస విజయాలతో ఆకట్టుకున్న వెంకటేష్ విక్టరీని తన ఇంటిపేరుగా మార్చుకున్నాడు. ‘శ్రీనివాస కళ్యాణం’, ’స్వర్ణకమలం’, ’గణేష్’, ‘తులసి’, ‘లక్ష్మి’, ‘నువ్వునాకు నచ్చావ్’ వంటి డిఫరెంట్ మూవీస్‌తో నటుడిగా ఒక మూసకు పరిమితం కాలేదు. మరోవైపు ‘చంటి’, ‘సుందరకాండ’, ‘చినరాయుడు’, ‘పవిత్ర బంధం’, ‘రాజా’, ‘సంక్రాంతి’ లాంటి సినిమాలతో ఫ్యామిలీ హీరోగా పేరుతెచ్చుకున్నాడు. వీటితో పాటు ‘బొబ్బిలి రాజా’, ‘శత్రువు’, ‘ధర్మచక్రం’, వంటి మాస్ సినిమాలతో మాస్ ప్రేక్షకులను అలరించాడు. ‘ప్రేమ’, ‘ప్రేమంటే ఇదేరా’, ‘ప్రేమించుకుందాం..రా’, ‘వాసు’ లాంటి సినిమాలతో యూత్‌కు దగ్గరయ్యాడు.
సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్లో వచ్చిన ‘బొబ్బిలిరాజా’ సినిమా వెంకటేష్‌కు స్టార్డమ్ తీసుకొచ్చింది. మరోవైపు 1991లో వచ్చిన ‘చంటి’ వెంకటేశ్ కెరీర్లో మరో మైలురాయి. ఈ సినిమాలో అమాయక పాత్రలో వెంకీ నటన అద్భుతంగా ఉంటుంది. ఈ సినిమా హిందీలో ‘అనాడి’గా రీమేక్ అయ్యింది.ఈ మూవీతో వెంకటేశ్ బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు. ఇక ఈ పుట్టినరోజు వెంకటేష్‌కు ఎందుకు అంత స్పెషల్ అంటే సురేష్‌ప్రొడక్షన్స్‌లో వాళ్ళ సొంత బ్యానర్లో అక్కినేని చైతన్య తన సొంత మేనల్లుడితో కలిసి నటించిన చిత్రం వెంకీమామ. ఈ చిత్రం తన పుట్టినరోజు సందర్భంగా విడుదలకావడం అంతే కాక ఈ చిత్రంలో ఎన్నో ఎమోషన్స్‌ని ఆయన చూపించారు. వెంకటేష్, నాగచైతన్య, సురేష్‌బాబు అందరూ చాలా ఎమోషన్‌గా ఫీలయి చేసిన చిత్రమిది. అందరూ సొంత వాళ్ళు కావడంతో ఈ చిత్ర ప్రమోషన్ టైంలో వెంకటేష్ స్టేజ్ మీద మాట్లాడే ప్రతి సారి ఎంతో ఎమోషన్‌గా ఫీలయ్యారు.