లక్ష్మి మీనన్ ఇప్పుడు కోళీవుడ్ లో క్రేజీ హీరోయిన్.. కేరళ నుండి వచ్చి తమిళ్లో పాగా వేసిన ఈ అమ్మడు అంటే తమిళ్ హీరోలు చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారట. తాజాగా ఆ జాబితాలో సూపర్ స్టార్ రజినికాంత్ అల్లుడు ధనుష్ కూడా చేరిపోయాడు. కొలవెరి డి పాటతో ఇండియా మొత్తాన్ని తనవైపు తిప్పుకున్న ఈ హీరో.. ప్రస్తుతం తను చేయబోయే సినిమాకి హీరోయిన్ గా లక్ష్మి మీనన్ ని పెట్టుకోవాలని చూస్తున్నాడట. ఇక లక్ష్మి విషయానికొస్తే సజహమైన నటనతో ప్రేక్షకులను తన బుట్టలో వేసుకుంది.
2011 లో ‘రఘువినంతే స్వంతం రజియా’ సినిమాతో మళయాలం లో తెరంగేట్రం చేసిన లక్ష్మి, సుదరపాండియన్ అనే తమిళ సినిమాతో తమిళ్ లో ఎంట్రీ ఇచ్చింది.ఈ సినిమా లో అమ్మడి నటనకుగాను బెస్ట్ డెబ్యూ ఫీమేల్ ఫిల్మ్ ఫేర్ అవార్డ్ ని కూడా అందుకుంది. ఇక మొదటి సినిమాతోనే తమిళ్ ప్రేక్షకుల మనసుని గెలుచుకున్న ఈ అమ్మడు జిగర్థండా, వసంత కుమరణ్, నాన్ సిగప్ప మణితన్ సినిమాల్లో చేస్తుంది. ఈ అమ్మడి నటనకు ఫిదా అయిన ధనుష్ ఎలాగైనా సరే ఆమెను తన సినిమాలో హీరోయిన్ గా ఓకే చేయించేలా ప్లాన్ చేస్తున్నాడట.
ఈ ఇయర్ రాంజానాతో బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చి సూపర్ హిట్ కొట్టిన ధనుష్ హీరోయిన్ల ఎంపికలో కూడా చాలా జాగ్రత్త వహిస్తున్నాడని తమిళ చిత్ర పరిశ్రమ అభిప్రాయ పడుతుంది.సో మొత్తానికి ధనుష్ లక్ష్మి నటనకి పడిపోయాడనే అనిపిస్తుంది..సో చూద్దం వీల్లిదరు కలిసి మనల్ని పడేస్తారో లేదో మరి..అదేనండి మంచి సినిమాతీసి ఆనంద వెల్లువల్లో పడేస్తారో లేదో చూద్దాం.
మరింత సమాచారం తెలుసుకోండి: