రేప్ అంటే ఏంటో పిల్లలకు తెలియాలని షాకింగ్ కామెంట్స్ చేసిన డైరెక్టర్...!

Reddy P Rajasekhar

ఈ మధ్య కాలంలో అత్యాచారాలు, హత్యలకు సంబంధించిన ఘటనలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. దేశంలో ఏ రాష్ట్రం ఇందుకు మినహాయింపు కాదు. తప్పు చేసిన నిందితులకు కోర్టులు కఠిన శిక్షలు విధిస్తున్నా నేరాల సంఖ్య పెరుగుతూ ఉందే తప్ప తగ్గటం లేదు. కొన్ని రోజుల క్రితం బాలీవుడ్ లో పతీ పత్నీ ఔర్ వో అనే సినిమా ట్రైలర్ విడుదలైంది. ఈ ట్రైలర్ లో 'పెళ్లైన తరువాత భార్యను సెక్స్ చేద్దామని అడిగితే అడుక్కుతినేవాడు అంటారు రెచ్చగొట్టి సెక్స్ చేస్తే రేపిస్ట్ అంటారు ' అనే డైలాగ్ ఉంది. 
 
ఈ డైలాగ్ పై వివాదం చెలరేగటంతో చిత్ర యూనిట్ సినిమా నుండి ఈ డైలాగ్ ను తొలగించింది. పతీ పత్నీ ఔర్ వో సినిమా డైరెక్టర్ అజీజ్ మీడియాతో ఆ డైలాగ్ గురించి మాట్లాడుతూ రేప్ డైలాగ్ ను మ్యూట్ చేయాల్సి వచ్చినందుకు చాలా బాధగా ఉందని చెప్పారు. మ్యారిటల్ రేప్ సీరియస్ సమస్య అని నాకు తెలుసని కానీ నా సినిమాలోని డైలాగ్ ను మ్యూట్ చేయడం సమస్యకు పరిష్కారం కాదని అజీజ్ చెప్పారు
 
12 సంవత్సరాల పిల్లలకు రేప్ అంటే ఏమిటో తెలియాల్సిన అవసరం ఉందని పిల్లలకు తెలియకపోతే ఏది తప్పు ఏది ఒప్పు అనే విషయాలు పిల్లలకు ఎప్పటికీ తెలీవని అజీజ్ చెప్పారు. డైలాగ్ లను మ్యూట్ చేయడం వలన ఎటువంటి ఉపయోగం ఉండదని రేప్ లాంటివి జరగకుండా అరికట్టడం ముఖ్యమని అజీజ్ చెప్పారు. డైలాగులను మ్యూట్ చేసినంత మాత్రాన సమాజం మారిపోదని అజీజ్ చెప్పారు. 
 
అమీర్ ఖాన్ నటించిన త్రీ ఇడియట్స్ సినిమాలో కూడా రేప్ డైలాగ్ ఉందని ఆ సినిమాలో 36 సార్లు అత్యాచారం అనే పదాన్ని వాడారని నా డైలాగ్ తప్పు అయితే ఆ సినిమాలోని డైలాగ్ కూడా తప్పే కదా..? అప్పుడు ఎందుకు ఎవరూ అభ్యంతరం చెప్పలేదని అజీజ్ ప్రశ్నించాడు. నేను ప్రజలకోసం మాత్రమే సినిమాలు తీస్తున్నానని సినిమా విడుదలయ్యాక అభ్యంతరాలను, అభిప్రాయాలను చెప్పాలని సినిమా విడుదలకు ముందు నోటికొచ్చినట్లు వాగకూడదని అజీజ్ చెప్పారు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: