ఒకప్పుడు టాప్ యాంకర్..ఇప్పుడు విలన్ గా రీ ఎంట్రీ?
పీపుల్స్ స్టార్ ఆర్ నారాయణమూర్తి చేతుల మీదుగా 22 ఏళ్ల వయసులో ఆమె సినీ ఇండస్ట్రీలోకి పరిచయమైంది. మూర్తి దర్శకత్వంలో వచ్చిన ఎర్రసైన్యంలో నటించింది. అనంతరం కొండవీటి సింహాసనం, శ్రావణ మాసం, ఖైదీ బ్రదర్స్ వంటి సినిమాలలో నటించింది. తెలుగులో మాత్రమే కాకుండా తమిళ, కన్నడ సినిమాలోను ఉదయభాను నటించింది. ఆ తర్వాత యాంకర్ గా తన ప్రయాణాన్ని ప్రారంభించింది. ఈటీవీలో ప్రారంభమైన హృదయాంజలి ప్రోగ్రామ్ తో తెలుగు నాట గుర్తింపు సంపాదించుకుంది.
ఇక జెమినీ టీవీలో వచ్చిన వన్స్ మోర్ ప్లీజ్ తో ఆమె క్రేజ్ మారిపోయింది. దివంగత హాస్యనటుడు వేణుమాధవ్ తో కలిసి ఉదయభాను చాలా అల్లరి చేసేది. యాంకర్ అంటే ఉదయభాను అనేంతలా ప్రేక్షకులలో చెరగని ముద్ర వేసుకుంది. ఈవిడ కనిపించని ఛానల్ అంటూ ఉండేది కాదు. గత కొంతకాలం నుంచి ఉదయభాను సినీ ప్రపంచానికే కాస్త దూరంగా ఉంటుంది. ఇప్పుడు మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించింది. తనలోని మరో యాంగిల్ ను బయట పెట్టడానికి ఉదయభాను సిద్ధం అవుతుంది. విలనిజాన్ని చూపించడానికి సిద్ధమవుతోంది.
సత్యరాజ్ ప్రధాన పాత్రలో బార్బరిక్ అనే సినిమా రాబోతోంది. మోహన్ శ్రీవత్స ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా విడుదల కానుంది. మారుతీ కూడా ఇందులో ఓ భాగం కానున్నాడు. ఈ సినిమాలో విలన్ గా నటించడానికి ఉదయభాను ఆసక్తిని చూపిస్తోందట. ఉదయభాను పాత్ర ఈ సినిమాలో చాలా ఆసక్తికరంగా ఉంటుందని ఈ సినిమాతో ఉదయభాను ఇమేజ్ పూర్తిగా మారిపోతుందని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. జనవరి 3న టీజర్ రిలీజ్ కానుంది. ఈ టీజర్ చూశాక ఉదయభాను పాత్రపై క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయి.