తగ్గేదేలే .. బాలీవుడ్‌కు సై అంటున్న కిసిక్ భామ.. ఆ స్టార్ హీరోకు జంటగా శ్రీలీలా ఫిక్స్..?

Amruth kumar
అల్లు అర్జున్ హీరో గా వచ్చిన పుష్ప 2 సినిమా బాక్సాఫీస్ దగ్గర దుమ్ము రేపుతుంది .. ఇక ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ తో అదరగొట్టిన హీరోయిన్ శ్రీలీల.. ఇక దాంతో అటు బాలీవుడ్ లో కూడా ఈ ముద్దుగుమ్మ పేరు ఓ రేంజ్ లో మారుమొగుతుంది .. అలాగే శ్రీలీల‌ బాలీవుడ్ లో సినిమాలు చేయవచ్చని వార్తలు వినిపిస్తున్నాయి .. ప్రముఖ ఫిలిం మేకర్ కరణ్ జోహార్ తన రాబోయే సినిమా ‘తు మేరీ మైన్ తేరా, మేన్ తేరా తు మేరీ’తో శ్రీ లీలకి పెద్ద బ్రేక్ ఇచ్చే అవకాశం ఉందని అంటున్నారు ..

ఇండియా టుడే నివేదిక ప్రకారం ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్ పై రాబోయే సినిమాలో శ్రీ లీల హీరోయిన్ గా నటిస్తుందన్నది టాక్ . ఈ సినిమా తోనే ఆమె బాలీవుడ్ లో అడుగు పెట్టబోతుందని అంటున్నారు . ఇక ఇందులో కార్తీక్ ఆర్యన్ ప్రధాన పాత్ర లో నటించనున్నాడని  తెలుస్తుంది . అయితే దీనిపై ఇంకా అధికార ప్రకటన రాలేదు .. దీంతో ఇప్పుడు శ్రీలీల, కార్తీక్ ఆర్యన్ పేర్లు  తెగ వైరల్ అవుతున్నాయి .. ధర్మ ప్రొడక్షన్స్ తో శ్రీలీల‌ చర్చలు జరుపుతున్నట్లు టాక్ వినిపిస్తుంది . ఆమె ఓకే అయితే ఇదే ఆమె బాలీవుడ్ తొలి మూవీ అవుతుంది ..

బాలీవుడ్ లోకార్తీక్ ఆర్యన్ జంటగా శ్రీలీల‌ అదరగొడుతుందని టాక్ . ఇక శ్రీలీల‌ 2019 లో ‘కిస్’ అనే కన్నడ సినిమాతో చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టింది .. ఆ తర్వాత పెళ్లి సందడి సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైంది . అదే విధంగా తెలుగులో గుంటూరు కారం , ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్ , భగవంత్‌ కేసరి , స్కంద , ధమాకా వంటి హిట్ సినిమాలో నటించింది .. రీసెంట్ గానే  పుష్ప2 సినిమాలో స్పెషల్ సాంగ్లో మెరిసింది .

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: