2025లో ఎక్కిన విమానం 2024లో దిగాడు.. ఎలాగో తెలుసా?
వివరాల్లోకి వెళ్తే.. హాంకాంగ్‌లో ఒక విమానం 2025 జనవరి 1 అర్థరాత్రి 12 గంటల 38 నిమిషాలకు "లాస్ ఏంజిలిస్"కి వెళ్ళింది. ఈ క్రమంలో మొదట హాంకాంగ్ విమానాశ్రయంలో అందులోని ప్రయాణికులు కొత్త సంవత్సరంకు స్వాగతం పలుకుతూ... ఎయిర్ పోర్ట్‌లో బంధువులు, మిత్రులు, శ్రేయోభిలాషులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పుతూ ఎయిర్ పోర్ట్‌లో న్యూ ఇయర్ వేడుకల్లో పాల్గొని కేక్‌లు కట్ చేశారు. విషయం ఏమిటంటే, విమానంలో ప్రయాణించిన వారు అంతా లాస్ ఎంజిలిస్‌లో ల్యాండ్ అయ్యేప్పటికి అక్కడ సమయం రాత్రి 8 గంటలు అయ్యింది. జనవరి 1వ తారీకు రాత్రి 8 గంటలు కాకుండా, 2024 డిసెంబర్ 31వ తారీకు రాత్రి 8 గంటలు అయ్యింది. అక్కడ ల్యాండ్ అయిన 4 గంటల తర్వాత మరోసారి ఆ విమానంలో ప్రయాణించిన వారు కొత్త సంవత్సరం వేడుకలు జరుపుకున్నారన్నమాట.
టైమ్ జోన్‌లు వేరు వేరుగా ఉండటం వలన ఒక్కో దేశంలో ఒక్కో సమయంకు కొత్త సంవత్సరం వస్తుంది అనే సంగతి అందరికీ తెలిసినదే. కాలానికి ఎదురు వెళ్లడంతో ఆ విమాన ప్రయాణికులు 2 దేశాల్లో 2 సార్లు నూతన సంవత్సరానికి స్వాగతం పలికారని ఇపుడు అర్ధం అయిందా? ఇలాంటివి ప్రతి ఏడాది జరుగుతూనే ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో ఈసారి ఈ విషయం గురించి చర్చ జరుగుతూ వైరల్ అవుతోంది. హాంకాంగ్‌కి లాస్ ఎంజిలిస్‌కి మధ్య టైం వ్యత్యాసం సుమారు 16 గంటలు ఉంది. అంటే లాస్ ఎంజిలిస్ కంటే 16 గంటల ముందు హాంకాంగ్‌లో న్యూ ఇయర్ వచ్చింది. హాంకాంగ్‌లో కొత్త సంవత్సర వేడుక జరుపుకున్న వారు విమానంలో లాస్ ఏంజిలిస్ కి వెళ్లి మళ్లీ కొత్త సంవత్సర వేడుకలు జరుపుకోవడం విశేషం.