ఒక లైలా కోసం, ముకుందా సినిమాలతో తెలుగు తెరకు పరిచయం అయ్యింది. ఈ మూవీస్ లో పూజా హెగ్డే చాలా ట్రెడిషినల్ గా కనిపించింది. 2010 లో విశ్వసుందరి పోటీలకు భారతదేశం నుంచి ఎంపిక కోసం జరిగిన అందాల పోటీల్లో రెండో స్థానం లో నిలిచింది. ఆ తర్వాత మోడల్ గా కెరీర్ ప్రారంభించింది. 2012 కోలీవుడ్ లో ముగమూడి అనే సినిమాలో అవకాశం వచ్చింది. 2014 లో వరుణ్ తేజ్ హీరోగా నటించిన ముకుంద సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయింది. తరువాత ‘ ఒక లైలా కోసం ’ సినిమాలో నటించింది.
2016 లో అశుతోష్ గోవారికర్ దర్శకత్వంలో వచ్చిన మొహంజదారో సినిమాలో నటించింది. అప్పటి వరకు పూజా హెగ్డే కి ఒక్క బ్రేక్ కూడా రాలేదు. ఇక హరీష్ శంకర్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించిన ‘దువ్వాడ జగన్నాథం’ మూవీ పూజా హెగ్డే జాతకమే మార్చింది. ఈ మూవీలో బికినీ సీన్లు అమ్మడికి ఒక్కసారే క్రేజ్ తీసుకు వచ్చాయి. తర్వాత స్టార్ హీరోల సరసన వరుస ఛాన్సులు కొట్టేస్తుంది. గ్లామర్ పాత్రల్లో పిచ్చిగా రెచ్చిపోతున్న క్రేజీ బ్యూటీ ప్రస్తుతం పలు ప్రతిష్టాత్మక సినిమాల్లో నటిస్తోంది. ఇప్పటికే ఎన్టీఆర్, మహేష్ బాబు లతో నటించిన ఈ బ్యూటీ ప్రభాస్ సరసన కూడా నటిస్తుంది.
ఈ మద్య వరుణ్ తేజ్ నటించిన గద్దలకొండ గణేష్ (వాల్మీకి) మూవీతో మరో విజయం అందుకుంది. తాజాగా త్రివిక్రమ్ శ్రీనివాస్ - అల్లు అర్జున్ కాంబినేషన్ లో వస్తున్న ‘అలా వైకుంఠపురములో’ హీరోయిన్ గా నటిస్తుంది. తాజాగా పూజా హెగ్దే ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ ఫొటోను పోస్ట్ చేసింది. ఈ ఫొటోలో ఈ బ్యూటీ అందాలొలకబోస్తూ ఆకట్టుకుంటోంది. మెడలో ధరించిన భారీ నెక్లెస్, చెవులకు గుండ్రని పెద్ద చెవి దుద్దులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. చేతికి నిండుగా గాజులు ధరించింది. ఉంగరాలు కూడా ఉన్నాయి. డ్రెస్‌కి మ్యాచింగ్ ఐ షేడ్స్ వేసి మురిపిస్తోంది పూజాహెగ్డే. మొత్తానికి తన ఎద అందాలు చూపిస్తూ కుర్రాళ్లను రెచ్చగొడుతుంది.