మ్యాడ్ హౌస్ ను ఎంచుకున్న నిహారిక !

Seetha Sailaja
‘ఒకమనసు’ మూవీతో ఫిలిం హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన నిహారిక ‘సూర్యకాంతం’ మూవీ తరువాత తనకు కొన్ని ఆఫర్స్ వచ్చినా ఆమె చేయడానికి ఇష్టపడటం లేదు అని తెలుస్తోంది. అంతేకాదు తనకు హీరోయిన్ మెటీరియల్ లేదు అంటూ ప్రేక్షకులు అభిప్రాయ పడుతున్న నేపధ్యంలో వారి అభిప్రాయాలను లెక్క చేయకుండా మరిన్ని సినిమాలు చేయడం ఏమాత్రం మంచిది కాదు అన్న తన నిర్ణయాన్ని తన తండ్రి నాగబాబుకు పెదనాన్న చిరంజీవికి చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి.

అయితే మరొక విధంగా నిహారిక తన కెరియర్ ను కొనసాగించాలని స్పష్టమైన నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. తెలుస్తున్న సమాచారం మేరకు నిహారిక తన ‘పింక్ ఎలిఫెంట్’ బ్యానర్ పై ‘మ్యాడ్ హౌస్’ అనే వెబ్ సిరీస్ నిర్మాణానికి శ్రీకారం చుట్టినట్లుగా ఆమె ఒక కీలక ప్రకటన చేసింది. 

100 ఎపిసోడ్స్ కూడిన ఈ వెబ్ సిరీస్ నిర్మాణం దాదాపు ఏడాదిన్నర పడుతుంది కాబట్టి ఆ వెబ్ సిరీస్ నిర్మాణం పూర్తి అయ్యేవరకు మరో ప్రాజెక్ట్ పెట్టుకోకుండా ఈ ప్రాజెక్ట్ పై తన పూర్తి ఏకాగ్రతను చూపెట్టాలని నిహారిక ప్రయత్నిస్తోంది. ఇద్దరి అమ్మాయిలు అద్దెకు ఉండే ఇంటి యజమానిగా నిహారిక ఆ అమ్మాయిలతో ఆ అమ్మాయిల బాయ్ ఫ్రెండ్స్ తో ఆటాడుకునే ఒక విభిన్నమైన పాత్రను నేటి యూత్ కు బాగా కనెక్ట్ అయ్యే విధంగా ఆమె పాత్రను డిజైన్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. 

అంతేకాదు అంతా కొత్తవారితో కొన్ని చిన్న సినిమాలు తీసే ఆలోచనలు కూడ నిహారిక చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలలో తాను నటించకుండా కేవలం నిర్మాణ వ్యవహారాలను మాత్రమే చూసుకుంటూ తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ని కొనసాగించాలని ఈ మెగా డాటర్ చేస్తున్న ప్రయత్నాలు ఎంత వరకు సక్సస్ అవుతాయో అన్నదే సందేహం..
 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: