బిగ్బాస్ సీజన్ -3 గ్రాండ్ ఫినాలే విన్నర్ గా పాప్ సింగర్ రాహుల్ సిప్లి గంజ్ నిలిచాడు. ఫైనల్ కి మొత్తం 5 కాంటెస్టులు మిగిలారు. రాహుల్ , శ్రీముఖి, బాబా భాస్కర్, వరుణ్, అలీ రెజా ఉన్నారు. ఎలిమినేషన్ మొదలవగానే ముందుగా అలీ రెజా హౌజ్ నుంచి బయటకు వచ్చేశాడు. ఆ తర్వాత హీరో వరుణ్ బయటకు వచ్చేశాడు. ఎలిమినేషన్ రౌండ్లో చివరిగా బాబా భాస్కర్ హౌజ్ నుండి బయటకు రాగా రాహుల్ , శ్రీముఖి మాత్రమే ఫైనల్ గా ఉన్నారు. ఇక గ్రాండ్ ఫినాలేకు అదనపు ఆకర్షణగా వచ్చిన హీరో శ్రీకాంత్ కాంటెస్టులను ఆటపట్టించారు. ఈ క్రమంలో పునర్నవి తనకు ఇష్టమైన కంటెస్టెంట్ అని శ్రీకాంత్ చెప్పి కవ్వించాడు. అలాగే సినీ తారలు అంజలి, క్యాథరిన్, రాశి ఖన్నా గ్రాండ్ ఫినాలేకు విచ్చేసి ఆట పాటలతో సందడి చేశారు. ఇస్మార్ట్ హీరోయిన్ నిధి అగర్వాల్ డాన్సులు, అనురాగ్ కులకర్ణి పాడిన 'రాములో రాములా..' పాటతో స్టేజీ దద్దరిల్లి పోయింది. దీంతో బిగ్ బాస్ ఫైనల్ ఎపిసోడ్ ప్రేక్షకులకు ఓ రేంజ్ లో ఎంటర్టైన్ చేసింది.
ఇక ఓవరాల్ గా చూస్తే ఈ గ్రాండ్ ఫినాలే మొత్తం ఎంతో రసవత్తరంగా సాగింది. ఆదివారం జరిగిన ఈ కార్యక్రమంలో తొలుత సినీ హీరో వరుణ్ సందేశ్, బాబా భాస్కర్, అలీ రెజా ఎలిమినేట్ అయ్యారు. ఈ ప్రక్రియ నిర్వహణలో ముఖ్య అతిధిలుగా విచ్చేసిన నటి రాశి ఖన్న, దర్శకుడు మారుతి, అంజలి వచ్చి బిగ్బాస్ హౌస్లోకి అడుగుపెట్టి ఇంటి సభ్యులకు సర్ప్రైజ్ ఇచ్చారు. వీరికి తోడు మా టివి బుల్లి తెర నటీనటులు కూడా జతకట్టడంతో ఆటపాటలతో స్టేజ్ లో సందడి చేశారు.
ఈ గ్రాండ్ ఫినాలే కార్యక్రమానికి సైరా నర సింహారెడ్డి నటుడు చిరంజీవి విచ్చేయడంతో గ్రాండ్ లుక్ వచ్చింది. అందులోను చిరు, నాగ్ ల మధ్య జరిగిన మాటల ఛలోక్తులు యావత్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ముఖ్య అతిథికి బిగ్ బాస్ కాంటెస్ట్ ల పరిచయ కార్యక్రమం చాలా ప్రోత్సహకారంగా సాగింది. చిరు ఒక్కొక్కరిని ప్రశంసిస్తుంటే వారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఇక ఫైనల్ విన్నర్ రాహుల్ కి మెగాస్టార్ చేతుల మీదుగా ట్రోఫీని అందించారు. దీంతో శ్రీముఖి మొహం లో కాస్త నిరాశ కనిపించింది.