పవన్ కళ్యాణ్ ని గట్టిగా టార్గెట్ చేసిన రాంగోపాల్ వర్మ?
ఇటువంటి నేపథ్యంలో తాజాగా లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా మరవకముందే 'కమ్మ రాజ్యంలో కడప రెడ్లు' అనే టైటిల్ సోషల్ మీడియాలో ప్రకటించి హైప్ క్రియేట్ చేసిన రామ్ గోపాల్ వర్మ తాజాగా ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ ని గట్టిగా టార్గెట్ చేసినట్లు రిలీజ్ అయిన పోస్టర్లు బట్టి అర్థం అవుతుంది. ప్రస్తుతం 'కమ్మ రాజ్యంలో కడప రెడ్లు' అనే సినిమా గురించి సోషల్ మీడియాలో నెటిజన్లు తెగ చర్చించుకుంటున్నారు. విషయంలోకి వెళితే ట్విట్టర్ ద్వారా రాంగోపాల్ వర్మ అక్టోబర్ 27న ఉదయం 9:36 గంటలకు 'కమ్మరాజ్యంలో కడప రెడ్లు' చిత్ర ట్రైలర్ రిలీజ్ చేయబోతున్నట్లు వర్మ ప్రకటించాడు.
కాగా తాజాగా ఈ సినిమాకి సంబందించిన రామ్‌గోపాల్‌వర్మ రిలీజ్ చేసిన పోస్టర్స్ ఆసక్తికరంగా మారుతున్నాయి. వైస్ జగన్ పాత్రలో యువ నటుడు అజ్మల్ అమీర్ నటిస్తున్నాడు. అద్భుతమైన హావభావాలతో అజ్మల్ జగన్ పాత్రలో ఒదిగిపోయాడు. ఇక పోస్టర్స్ లో మాజీ సీఎం చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ని పోలిన పాత్రలు కూడా కనిపిస్తున్నాయి. తరచుగా వర్మ పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం చూస్తూనే ఉన్నాం. ఈ చిత్రంలో కూడా పవన్ పాత్రని వెటకారంగా చూపించబోతున్నట్లు ఫిలింనగర్ లో టాక్ వినబడుతోంది.