వర్షాల వల్ల వరుణ్ తేజ్ కూడా నష్టపోతున్నాడు
మెగా హీరో వరుణ్ తేజ్ నటించిన లేటెస్ట్ మూవీ గద్దలకొండ గణేష్. విడుదలైన మొదటి రోజునుండే సూపర్ హిట్ టాక్ ను రాబట్టుకుంది ఈ చిత్రం. టాక్ కు తగ్గట్లే మొదటి నాలుగు రోజులు మంచి వసూళ్లను రాబట్టింది. అయితే వర్షాల కారణంగా మంగళ, బుధవారాల్లో ఈచిత్రం యొక్క కలెక్షన్స్ భారీగా డ్రాప్ అయ్యాయి. ముఖ్యంగా ఫస్ట్ షో , సెకండ్ షో లపై వర్షం తీవ్ర ప్రభావం చూపించింది. దాంతో ఈ చిత్రం 5 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో 17కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టింది. ఇదే రన్ ను కొనసాగిస్తే ఈచిత్రం బ్రేక్ ఈవెన్ అవ్వడం కూడా కష్టమే అవుతుంది.
హరీష్ శంకర్ డైరెక్షన్ లో గ్యాంగ్ స్టార్ డ్రామా గా తెరకెక్కిన ఈ చిత్రం లో వరుణ్ నటన , డైలాగ్స్ , హరీష్ మార్క్ డైరెక్షన్ హైలైట్ అయ్యాయి. కోలీవుడ్ సూపర్ హిట్ మూవీ 'జిగర్తండా' కు రీమేక్ గా రూపొందిన ఈచిత్రంలో తమిళ యువ హీరో అథర్వ మురళి ముఖ్య పాత్రలో నటించగా పూజాహెగ్డే , మృణాళిని రవి హీరోయిన్లుగా నటించారు. వీరితో పాటు హాట్ బ్యూటీ డింపుల్ హయాతి ఈ చిత్రంలో స్పెషల్ సాంగ్ లో మెరిసింది. 14 రీల్స్ ప్లస్ బ్యానర్ ఫై రామ్ ఆచంట , గోపీచంద్ ఆచంట నిర్మించిన ఈచిత్రానికి మిక్కీ జే మేయర్ సంగీతం అందించాడు.