వరుణ్ తేజ్ ను తీహార్ జైలుకు పంపమని సలహా ఇచ్చిన జబర్దస్త్ కమెడియన్ !

Seetha Sailaja
ఈరోజు విడుదల అయిన ‘గద్దలకొండ గణేష్’ మూవీకి సగటు ప్రేక్షకుడి నుండి మంచి మార్కులు పడినప్పటికీ ఈ మూవీ ఏమేరకు సక్సస్ అవుతుంది అన్న విషయం ఈ వీకెండ్ తరువాత మాత్రమే తెలిసే ఆస్కారం ఉంది. ఈ మూవీని ప్రమోట్ చేస్తూ వరుణ్ తేజ్ ‘జబర్దస్త్’ కార్యక్రమంలోకి వస్తున్నాడు.

ఈ కార్యక్రమం ఈరోజు రాత్రి ప్రసారం కాబోతోంది. దీనితో ఈ షోకి సంబంధించిన ప్రోమొలను ఈ షోను ప్రసారం చేసే ఛానల్ ఈరోజు చాల విరివిగా ప్రసారం చేస్తూ తన షోకు రేటింగ్స్ పెంచుకోవడానికి ప్రయత్నాలు చేస్తోంది. ఇలాంటి పరిస్థితులలో ఈ షోలో పాల్గొంటున్న జబర్దస్త్ కమెడియన్ ఆర్పీ వరుణ్ తేజ్ ను టార్గెట్ చేస్తూ చేసిన కామెంట్స్ ను ఆ ఛానల్ తన ప్రోమోలో విపరీతంగా చూపిస్తోంది.

అమ్మాయిలకు నిద్రపట్టకుండా చేయడం వరుణ్ తేజ్ చేసిన నేరం అయితే అతడిని తీహార్ జైలుకు పంపడం మంచిది అంటూ ఆర్పీ వేసిన జోక్ కు వరుణ్ తేజ్ తో పాటు నాగబాబు కూడ తెగ నవ్వడం ఆ ప్రోమోకు హైలెట్ గా మారింది. ఇదే సందర్భంలో ఈ మూవీ ద్వారా హీరోయిన్ గా పరిచయం అవుతున్న మృణాళిని టార్గెట్ చేస్తూ ఆర్పీ మరో ట్విస్ట్ ఇచ్చాడు. 

మృణాళిని నవ్వుతూ ఉంటే ఆమె నవ్వులో ముత్యాలు రాలిపోతున్నాయి అంటూ ఈ కమెడియన్ నవ్వులు పూయించాడు. వాస్తవానికి ఏ సినిమాకు అయినా విడుదలకు ముందు వివాదాలు వస్తే ఆ వివాదాల వల్ల ఆ సినిమా క్రేజ్ బాగా పెరుగుతుంది దీనితో ‘వాల్మీకి’ గద్దలకొండ గణేష్’ గా మారిన పరిస్థితులలో ఈ వివాదం వరుణ్ తేజ్ కు కలక్షన్స్ పరంగా ఎంతవరకు సహాయ పడుతుందో చూడాలి. అసలు విషయం ఈ వీకెండ్ తరువాత తేలుతుంది..


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: