వెంకీమామ సప్రైజ్ ఇవ్వనున్నాడు
ఎందుకంటే ఈ చిత్రం నుండి ఈ రోజు వినాయకచవితి సందర్భంగా సాయంత్రం 5:04 గంటలకు పోస్టర్ విడుదలకానుంది. ఆ పోస్టర్ తో పాటు రిలీజ్ డేట్ ను ప్రకటించే అవకాశాలు ఉన్నాయని సమాచారం. బాబీ డైరెక్షన్ లో కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో వెంకీ సరసన హాట్ బ్యూటీ పాయల్ రాజ్ పుత్ నటిస్తుంది. ఆమె ఈ చిత్రంలో టీచర్ గా కనిపించనుంది. కాగా నాగ చైతన్య కు జోడిగా రాశీ ఖన్నా నటిస్తుంది.
సురేష్ ప్రొడక్షన్స్ , పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ల ఫై సురేష్ బాబు , టిజి విశ్వప్రసాద్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈచిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నాడు. ఇక ఇటీవల ఎఫ్ 2 తో బ్లాక్ బ్లాస్టర్ హిట్ కొట్టి ఫామ్ లోకి రాగ మజిలీ తో నాగ చైతన్య సూపర్ హిట్ కొట్టి సక్సెస్ ట్రాక్ ఎక్కాడు. మరి ఇప్పుడు ఈ వెంకీ మామ వీరిద్దరికి ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి.