మనీ: మహిళా రైతులకు శుభవార్త.. రూ.12000 ..!!

Divya
కేంద్ర ప్రభుత్వం లోని మోడీ సర్కార్ ప్రభుత్వం రైతులకు సైతం పలు రకాల పథకాలను అందిస్తూనే ఉంది. ఆర్థికంగా నిలదొక్కుకునే విధంగా ఎన్నో రకాల పథకాలను సైతం అందుబాటులోకి తీసుకువస్తున్నారు.. అలా pm kison అనే పథకాన్ని కూడా ప్రకటించారు. ఇప్పుడు ఎన్నికల జరుగుతున్న నేపథ్యంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం మహిళల కోసం ఒక ప్రత్యేకమైన నిర్ణయాన్ని తీసుకున్నట్లు తెలుస్తోంది.దేశంలో మహిళా రైతులకు తాజాగా ఒక శుభవార్త చెప్పనున్నట్లు తెలుస్తోంది..pm kison ఆర్థిక సహాయాన్ని మహిళా రైతుల కోసం రెట్టింపు చేసే విధంగా ఆలోచనలో ఉన్నట్లు కనిపిస్తోంది.

మహిళ రైతులకు 12 వేల రూపాయలను అందించాలని కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు రాజకీయ నాయకుల వర్గాల నుంచి వార్తలు వినిపిస్తున్నాయి. మహిళా ఓటర్లను ఆకర్షించేందుకే ఈ విధంగా తెలియజేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఫిబ్రవరి 1న బడ్జెట్లో ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో ప్రతి ఏడాది కూడా ప్రభుత్వానికి రూ .1200 కోట్ల రూపాయల ఖర్చు అదనంగా పెరుగుతుందని సమాచారం.. ప్రస్తుతం పీఎం కిసాన్ నిధి యోజన కింద రైతులకు ఏడాదికి 6000 చొప్పున ఆర్థిక సహాయాన్ని సైతం అందిస్తున్నారు.

అయితే రాబోయే రోజుల్లో మొత్తం పీఎం కిసాన్ నిధి యోజన 6000 నుంచి 8000 వరకు పెంచే అవకాశం ఉన్నట్లుగా కూడా కనిపిస్తోంది. అయితే మరి మహిళా ఓటర్లను ఆకట్టుకునే విధంగా ప్రణాళిక చేపడతారా లేకపోతే రూ.8 వేల రూపాయల వరకు పెంచి పిఎం కిసాన్ ని సరిపెట్టుకుంటారు అనే విషయం తెలియాల్సి ఉంది.. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో మహిళలకు సైతం సాధికారికంగా కల్పించే విధంగా ఈ రెట్టింపు పెంచితే బాగుంటుందని ఆలోచిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం కనిపిస్తోంది. మరి ఈ విషయం పైన ఇంకా అధికారికంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించలేదు.. మరి పూర్తి విషయాలు తెలియాలి అంటే బడ్జెట్ సమావేశాల వరకు ఆగాల్సిందే..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: