Money: పెన్షనర్లకు అదిరిపోయే శుభవార్త తెలిపిన కేంద్ర ప్రభుత్వం..!
ఆర్.బి.ఐ కమిటీ సిఫార్సు చేసిన తొలి ముఖ్యమైన వాటిల్లో లైఫ్ సర్టిఫికెట్ సమర్పణ కూడా ఒకటి ఉందని ప్రస్తుతం బ్యాంకుల నుంచి పెన్షన్ పొందేవారు తమ బ్యాంకు బ్రాంచ్ కి వెళ్లి తమ లైఫ్ సర్టిఫికెట్ సమర్పించాలని స్పష్టం చేశారు. ఒకవేళ బ్యాంకు బ్రాంచ్ కి వెళ్ళలేక పోతే అప్పుడు ఆన్లైన్లో కూడా లైఫ్ సర్టిఫికెట్ సమర్పించే సర్వీస్ లను ఇటీవలే అందుబాటులోకి తీసుకొచ్చినట్లు.. వీడియో కాల్ ద్వారా పెన్షనర్లు ఈ పని పూర్తి చేయొచ్చు అని కూడా స్పష్టం చేశారు. ఇకపోతే ఇప్పుడు ఆర్బిఐ కమిటీ మరొక కీలక ప్రతిపాదన చేస్తూ బ్యాంకుకు చెందిన ఏ బ్రాంచ్ లో అయినా సరే ఈ లైఫ్ సర్టిఫికెట్ను సమర్పించే వెసులు బాటు ను అందుబాటులోకి తీసుకురావాలని స్పష్టం చేసింది.
ఇకపోతే పెన్షనర్లు వారి పెన్షన్ అకౌంట్ కలిగిన బ్యాంకుకు చెందిన ఏ బ్రాంచ్ లో అయినా సరే జీవన్ ప్రమాణ పత్రాన్ని సమర్పించే విధంగా సేవలు అందుబాటులోకి ఉంచాలి అని.. అంతేకాకుండా ఏడాదిలో ఏ నెలలో అయినా సరే లైఫ్ సర్టిఫికెట్ ను అందించే నిబంధనలను కూడా తీసుకొచ్చింది. ఏది ఏమైనా ఆర్బిఏ చేసిన ఈ కీలక ప్రకటన పెన్షనర్లకు మంచి ఊరట కలిగిస్తోందని చెప్పవచ్చు.