మనీ: ప్రైవేటు ఉద్యోగులకు శుభవార్త తెలిపిన ప్రభుత్వం..!

Divya
మీరు ప్రైవేట్ రంగంలో ఉద్యోగం చేస్తూ 10 సంవత్సరాలు పూర్తి చేసినట్లయితే.. మీకోసం కేంద్ర ప్రభుత్వం ఒక గుడ్ న్యూస్ ప్రకటించింది. ప్రైవేటు రంగ ఉద్యోగులకు పదవి విరమణ తర్వాత ప్రతి నెల పెన్షన్ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తుంది. అయితే కొన్ని షరతులు కూడా ఉంటాయట. మరి అవేంటో ఇప్పుడు మనం చూసి తెలుసుకుందాం.
ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ నిబంధనల ప్రకారం సంఘటిత రంగంలో పనిచేస్తున్న ఉద్యోగులు 10 సంవత్సరాలు పూర్తయిన వారికి పింఛన్ సౌకర్యం లభిస్తుంది. అయితే సదరు ఉద్యోగికి 58 సంవత్సరాల వయసు పూర్తి కావాల్సి ఉంటుంది ఆ తర్వాత ప్రతి నెల వారికి పెన్షన్ అందుతుంది.  కాదా ప్రతినెల ఉద్యోగుల జీతం నుంచి కొంత సొమ్ము మినహాయించడమే ఇందుకు కారణం.. 10 సంవత్సరాలపాటూ పని చేసిన తర్వాత ఏ ఉద్యోగి అయినా సరే 58 సంవత్సరాల వయసు ఉంటే ఇందుకు అర్హులవుతారు. ఉద్యోగి 9 సంవత్సరాల 6 నెలల సర్వీస్ ని కూడా 10 సంవత్సరాలకు సమానంగా లెక్కిస్తారు.

ఉద్యోగి పదవీకాలం తొమ్మిదిన్నర సంవత్సరాల కంటే తక్కువ ఉంటే 9 సంవత్సరాలుగా మాత్రమే పరిగణిస్తారు. ఉద్యోగి పదవి విరమణ వయసు కంటే ముందే పెన్షన్ ఖాతాలో జమ చేసిన నగదు విత్డ్రా చేసుకుంటే అటువంటి వారికి పెన్షన్ కి  అర్హత లభించదు.  కాగా ప్రైవేట్ రంగంలో పనిచేసే ఉద్యోగుల ప్రాథమిక జీతం అలాగే డిఏ లో కూడా 12 శాతం ప్రతినెల ప్రావిడెంట్ ఫండ్కు ఇవ్వబడుతుంది. ఒక కంపెనీలో 8.33% ఉద్యోగుల పెన్షన్ స్కీం లో డిపాజిట్ అవుతుంది అదే సమయంలో ప్రతి నెల 3.67 ఈపీఎఫ్ కి వెళ్తుంది. మీరు పనిచేస్తున్న సంస్థను విడిచిపెట్టిన తర్వాత కూడా ఉద్యోగంలో గ్యాప్ ఉంటే మీరు మళ్ళీ ఉద్యోగం ప్రారంభించినప్పుడు.. మీ యూఏఎన్ నెంబర్ను మార్చకూడదు. ఐదు - 5 సంవత్సరాలు రెండు వేర్వేరు సంస్థల్లో పనిచేసినట్లయితే అటువంటి ఉద్యోగికి కూడా పెన్షన్ ప్రయోజనం లభిస్తుంది. అయితే యూఏఎన్ నెంబర్ ఒకటే అయి ఉండాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: