మనీ: సీనియర్ సిటిజన్స్ కు శుభవార్త.. ఇలా చేస్తే పన్ను మినహాయింపు..!!

Divya
తాజాగా భారత దేశంలో ఇన్కమ్ టాక్స్ చట్టంలో పరిమితికి మించి ఆదాయం పొందేవారు తప్పకుండా ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది అని ప్రతి ఒక్కరికి తెలిసిందే. అయితే 60 నుంచి 80 సంవత్సరాలు మధ్య వయసున్న సిటిజనులకు ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్ స్పెషల్ ట్యాక్స్ బెనిఫిట్స్ అందించడానికి సిద్ధమైంది. ఇక ఈ క్రమంలోని ఎవరైతే 80 సంవత్సరాలు కంటే ఎక్కువ వయసు ఉన్న వారిని సూపర్ సీనియర్ సిటిజన్ లుగా నిర్ణయించడం జరిగింది. ముఖ్యంగా 60 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్నవారు పన్ను చెల్లింపుదారులతో పోలిస్తే సీనియర్ సిటిజన్లు, సూపర్ సీనియర్ సిటిజనులకు ఐటి రిటర్న్స్ వేయడంలో ప్రక్రియ కూడా చాలా ఈజీగా మారనున్నట్లు సమాచారం.
ఇక సీనియర్ సిటిజెన్లకు లభించే బెనిఫిట్స్ గురించి తెలుసుకున్నట్లయితే.. సెక్షన్ 208 ప్రకారం ఒక సంవత్సరం లేదా అంతకంటే ఎక్కువ పన్ను భారం ఉన్న వ్యక్తి తన పన్నును ముందస్తు రూపంగా పన్ను రూపంలో చెల్లించాలి . ముందస్తు పన్ను చెల్లించకుండానే  మినహాయింపు లభిస్తుంది. ఇక అందుకే వ్యాపారం లేదా వృత్తి నుంచి ఆదాయం పొందని సీనియర్ సిటిజనులకు ముందస్తుగా పన్ను చెల్లింపు నుంచే మినహాయింపు కలిగించడం గమనార్హం. ఇక ముఖ్యంగా ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 80 TTB , పోస్ట్ ఆఫీస్ లు, బ్యాంకులు, కో ఆపరేటివ్ బ్యాంకులలో డిపాజిట్ లపై సంపాదించిన వడ్డీ పై ప్రన్ను ప్రయోజనాలను అందిస్తూ ఉండడం గమనార్హం. ముఖ్యంగా సీనియర్ సిటిజెన్ల ద్వారా వచ్చే వడ్డీ పై గరిష్టంగా 50 వేల రూపాయల వరకు వడ్డీ ఆదాయానికి మినహాయింపు లభిస్తుంది
ముఖ్యంగా ఫిక్స్ డిపాజిట్లు ,  పొదుపుపై కూడా వడ్డీ ఈ నియమం ప్రకారం మినహాయించబడడం గమనార్హం. అంతేకాదు ఆదాయపు పన్నులో చట్టంలో సెక్షన్ 80 డి కింద మెడికల్ ఇన్సూరెన్స్ పాలసీ పై చెల్లించిన ప్రీమియం కు రూ.50,000 వరకు మినహాయింపు లభిస్తుంది. ఇక మనీ9 అనే ఓటీటీ యాప్ ద్వారా అందుబాటులో ఉంటుంది. దీని ద్వారా మీరు అన్ని విషయాలను తెలుసుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: