మనీ: రూ.36 ఆదా తో రూ.2 లక్షలు పొందే అవకాశం..!

Divya
అట్టడుగు, బలహీన వర్గాల వారికోసం ఇటీవల ప్రధాన మంత్రి చాలా పథకాలను అందుబాటులోకి తీసుకు వస్తున్న విషయం తెలిసిందే. ఈ పథకాల ద్వారా కొంత మంది ప్రజలకు సంతృప్తి కలుగుతుందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ పథకంలో డబ్బులు కూడా వస్తూ ఉంటాయి. అలాంటి పథకాలలో జీవన్ సురక్ష , బీమా పథకాలు కూడా వున్నాయి.వీటిలో పెట్టిన డబ్బులకు మంచి బెనిఫిట్స్ కూడా లభించనున్నాయి. ఇకపోతే జీవిత బీమా కు ఎంతటి ప్రాధాన్యం ఉందో ప్రతి ఒక్కరికీ తెలిసిన విషయమే.. ముఖ్యంగా మనం ఎంతగానో ప్రేమించే వ్యక్తి మరణిస్తే ఆ బాధ నుంచి కోలుకోవడానికి చాలా సమయం పడుతుంది అన్న విషయం కూడా ప్రతి ఒక్కరికి తెలుసు.
ముఖ్యంగా కుటుంబ పెద్ద మరణిస్తే ఆ బాధకి ఆర్థిక ఇబ్బందులు అన్ని తోడవుతాయి. ఒక జీవిత బీమా ఉంటే కొంతవరకు ఆర్థిక సమస్యల నుంచి విముక్తి పొందవచ్చు. చాలామంది జీవిత బీమాకు ఇంతటి ప్రాధాన్యం ఇస్తున్నారు. నిపుణులు సైతం జీవిత భీమా గురించి ప్రజలకు తెలియ చేస్తూ ఉండడం గమనార్హం. ఇకపోతే సరైన అవగాహన లేకపోవడం వల్ల జీవితబీమాకి దూరంగా ఉండాల్సి వస్తోంది. దీంతో వారి కుటుంబాలకు ఆర్థిక భద్రత కూడా లేకపోవడం గమనార్హం. ఈ కారణం వల్లే జీవిత బీమా సామాన్య ప్రజలకు సైతం చేరువ కావాలనే ఉద్దేశంతో నామమాత్రపు ప్రీమియంతో కేంద్ర ప్రభుత్వం,  ప్రధాన మంత్రి జీవన జ్యోతి బీమా యోజన పథకాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది.
ఎలాంటి కారణంచేత అయినా సరే పాలసీదారుడు మరణిస్తే కుటుంబానికి హామీ మొత్తం అందజేస్తోంది. ముఖ్యంగా ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం ఈ పథకంలో ప్రీమియం చెల్లించి పథకాన్ని రెన్యువల్ చేసుకోవాలి. జూన్ 1 నుంచి వచ్చే సంవత్సరం మే 31 వరకు అమలులో ఉంటుంది . ఆ తర్వాత వచ్చే ఏడాది కి మళ్ళీ మీరు రెన్యువల్ చేయించుకోవాలి.  ఇకపోతే ప్రస్తుతం వర్తించే ప్రీమియం ఏడాదికి 436 రూపాయలు. అంటే నెలకు 36 రూపాయల చొప్పున మీరు ఈ పథకంలో ఇన్వెస్ట్ చేయడం వల్ల వ్యక్తి మరణిస్తే రెండు లక్షల రూపాయల ఉచిత బీమా లభిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: