మనీ: రూ.1500 తో రూ.35 లక్షలు మీ సొంతం.. ఎలా అంటే..?

Divya
పోస్ట్ ఆఫీస్ ప్రవేశపెట్టిన గ్రామ సురక్ష పథకం ద్వారా రూ.1500 తోనే రూ.35 లక్షల రూపాయలు పొందే అవకాశం ఉంటుంది. సాధారణంగా ప్రతి మధ్యతరగతి వ్యక్తి ఆలోచించే విషయం ఏమిటంటే.. కష్టపడి సంపాదించిన డబ్బులు ఎక్కడ పెట్టుబడిగా పెడితే బాగుంటుంది అని ఆలోచిస్తూ ఉంటారు. సరైన మార్గంలో మీరు పెట్టే పెట్టుబడి కూడా మీ భవిష్యత్తును సూచిస్తుంది అని చెప్పాలి. భవిష్యత్తులో డబ్బు పరంగా నష్టపోకుండా ఉండాలి అంటే ముందు నుంచే ప్రణాళిక సిద్ధం చేసుకోవడం వల్ల భవిష్యత్తును సంరక్షించుకోవచ్చు. అంతే కాదు ఏ మాత్రం రిస్క్ లేకుండా పెట్టుబడికి కచ్చితమైన లాభాలు తెచ్చిపెట్టే ఇన్వెస్ట్మెంట్ లో మాత్రమే డబ్బులు ఇన్వెస్ట్ చేయాలి.
ఇక అలాంటిదే గ్రామ సురక్ష పథకం. మీ వయసు 18 సంవత్సరాలు అయితే నీకు ఇది ఒక మంచి పథకం అని చెప్పవచ్చు. 19 నుంచి 55 సంవత్సరాల వరకు ఈ పథకంలో మీరు డబ్బులు ఇన్వెస్ట్ చేసే అవకాశం ఉంటుంది. నిజానికి పోస్ట్ ఆఫీస్ లో ఎన్నో రకాల ఇన్వెస్ట్మెంట్ అవకాశాలు ఉన్నా .. ఇది మాత్రం మంచి పథకం అని చెబుతున్నారు మార్కెట్ విశ్లేషకులు. 19 సంవత్సరాల వయస్సు ఉన్న వారికి చాలా బాగా ఉపయోగపడుతుందని వారు సూచిస్తున్నారు. మీ వయసు 19 సంవత్సరాలు అయితే నెలసరి వాయిదా కేవలం 1515 రూపాయలు మాత్రమే చెల్లిస్తే సరిపోతుంది.
ప్రతి నెలా మీకు 55 సంవత్సరాల వయసు వచ్చే వరకు కట్టాల్సి ఉంటుంది. 58 సంవత్సరాల వరకు అయితే రూ.1463, 60 సంవత్సరాల పాటు అయితే రూ. 1411 చెల్లించాల్సి ఉంటుంది. ఇక గ్రామ సురక్ష పథకం ప్రకారం 55 సంవత్సరాలు పెట్టుబడిగా పెట్టిన వ్యక్తి  కాలం ముగిసే సరికి రూ. 34.60 లక్షలు సొంతం చేసుకోవచ్చు. ఈ పథకం లో పది వేల నుంచి పది లక్షల వరకు ఇన్వెస్ట్ చేసే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఖాతాదారుడు మరణిస్తే డబ్బులు మొత్తం నామినికి చెందుతుంది అని పోస్టల్ శాఖ స్పష్టం చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: