మనీ: ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త తెలిపిన కేంద్రం.. వచ్చే నెల డీఏ జమ..!!

Divya
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త అని చెప్పకనే చెప్పింది కేంద్ర ప్రభుత్వం.. ఇకపోతే కేంద్ర ప్రభుత్వం తమ ఉద్యోగులకు ప్రయోజనాన్ని కల్పించే విధంగా కీలక నిర్ణయాలు తీసుకుంది.. మార్చి నెల జీతం తో పాటు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు అలాగే పెన్షనర్లకు కూడా రానున్న ప్రయోజనాలు కూడా ఖాతాలో జమ కానున్నాయి. డియర్ నెస్ అలవెన్స్ తో పాటు ఎన్నో ప్రయోజనాలను కూడా విడుదల చేయనుంది కేంద్ర ప్రభుత్వం. ఈసారి మూడు శాతం డీఏ పెరుగుతుందని ఇదే జరిగితే 34 శాతం డీఏను ప్రభుత్వ ఉద్యోగులు అలాగే పెన్షనర్లు అందుకోబోతున్నారు అని సమాచారం.

డియర్ నెస్ అలవెన్స్ పెంపు.. హౌసింగ్ అలవెన్స్ తో పాటు డియర్ నెస్ రిలీఫ్ బకాయిలు విడుదల కోసం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు గత కొంతకాలం నుంచి ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈ నేపథ్యంలోనే మొన్నటి వరకు 31 శాతం తో డీ ఏ ఇస్తున్న  కేంద్ర ప్రభుత్వం.. ఇప్పుడు మార్చి నెల జీతం తో పాటు 34 శాతం డియర్ నెస్ అలవెన్స్ తో అదనపు జీవితం రానుంది. పెరిగిన డీ ఏ అలవెన్స్ లు  జనవరి 1 2022 నుంచి అమలు చేయబడుతుంది అని 2 నెలలకు కలుపుకుని మొత్తం ప్రభుత్వ ఉద్యోగుల ఖాతాలో జమ కానుందని సమాచారం.
కేంద్ర ఉద్యోగులకు మార్చి నెల జీతంతో పాటు కొత్త డియర్‌నెస్ అలవెన్స్‌ను కూడా పూర్తిగా చెల్లిస్తారు. హోలీ  మీ ప్రాథమిక జీతం రూ. 18, 000 - రూ.56, 900 కంటే తక్కువగా ఉంటే అలాగే మీరు 34 శాతం చొప్పున డీఏను లెక్కిస్తే, మీ ద్రవ్యోల్బణం నెలకు రూ. 19,346 చెల్లించబడుతుంది. అదే సమయంలో ఉద్యోగులకు రూ.17,639 బకాయిలు కూడా వస్తున్నాయి. ఉద్యోగుల డీఏలో మొత్తం రూ.1, 707 పెరగనుంది. వార్షిక ప్రాతిపదికన లెక్కించినట్లయితే, అది సుమారు రూ. 20 484 అవుతుంది కాబట్టి  మార్చిలో, ఉద్యోగులకు 2 నెలల బకాయిలు కూడా  ఇవ్వాల్సి ఉంది. దాని ప్రకారం, వారి ఖాతాలో రూ. 38, 692 బకాయిలు వచ్చి చేరుతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: