మనీ : ప్రభుత్వ పెన్షనర్లకు.. ఉద్యోగులకు శుభవార్త తెలిపింది కేంద్రం..!!

Divya
సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగస్తులకు, పెన్షనర్లకు హోలీ పండుగ సందర్భంగా ఈ శుభవార్తను తెలియజేస్తోంది.. సుదీర్ఘ కాల నిర్ణయ తర్వాత డియర్ నెస్ అలవెన్స్ ను (DA) ను 3% వరకు పెంచే విధంగా నిర్ణయాన్ని తీసుకొని ఉంది ప్రభుత్వం.. అయితే ఇప్పుడు ఉద్యోగస్తులకు, పెన్షనర్లకు .34% వరకు డియర్ నెస్ అలవెన్స్ పొందుతారని చెప్పవచ్చు.. ఇది జనవరి 2022 నుంచి ఈ అలవెన్స్ అందుబాటులో ఉండే విధంగా సెట్ చేశారు. ప్రస్తుతం ఉద్యోగస్తులు ఇప్పటివరకు..31% మాత్రమే DA ను పొందుతున్నారు.


కానీ జనవరి 2022 నుంచి 3% ఎక్కువగా డియర్ నెస్ అలవెన్స్ లో మార్పులు తీసుకు వచ్చినట్లు సమాచారం.. ప్రస్తుతం పెన్షనర్లు అలాగే ఉద్యోగులు 34 శాతం చొప్పున డియర్ నెస్ అలవెన్స్ ను పొందుతారు అన్నమాట.. జనవరి 1 2022 నుంచి అమలులోకి వచ్చేలా గా సెట్ చేశామని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.. ప్రస్తుత ఉద్యోగులు 31% డియర్ నెస్ అలవెన్స్ తో జీతం పొందుతున్న విషయం అందరికీ తెలిసిందే. కానీ ఇప్పుడు మూడు శాతాన్ని పెంపొందిస్తూ 2022 జనవరి నుంచి 34 శాతం డియర్ నెస్ అలవెన్స్ పొందుతారు . ఇక సెవెంత్ పే స్కేల్ సిఫార్సు మేరకు బేసిక్ జీతం ఆధారంగా చేసుకొని మాత్రమే డియర్ నెస్ అలవెన్స్ ను చెల్లిస్తారు.. అయితే వీటన్నింటిని మార్చిలో ప్రకటించవచ్చు భావిస్తున్నట్లు తెలుస్తోంది.

ఇకపోతే ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో 65 లక్షల మంది పెన్షనర్లు, 50 లక్షల మంది కేంద్ర ఉద్యోగులు లబ్ధి పొందుతారు అని సమాచారం. ఇక తదుపరి డియర్ నెస్ అలవెన్స్ జూలై 2022 లో లెక్కించ పోతారు. ఇదిలా ఉండగా 2021 డిసెంబర్ నెలకు సంబంధించిన AICPI -IW డేటా ను విడుదల చేయడం జరిగింది. ఇకపోతే 34% డియర్ నెస్ అలవెన్స్ లెక్కింపు వివరాలు విషయానికి వస్తే.. రూ.18000 బేసిక్ జీతంపై సంవత్సరానికి 6480 రూపాయలు డీఏ పెరగనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: