మనీ : డబ్బు సంపాదించాలనుకుంటే.. ఇలా చేయండి..!!

Divya
డబ్బు సంపాదించాలి అనుకున్నప్పుడు డబ్బు ఆదా చేయాలి అనే విషయాన్ని కూడా గుర్తుంచుకోవాలి.. మన ఇంటి నెలవారీ ఖర్చులు ఎంత అవుతున్నాయి అనే విషయాలపై మనకు ఒక అవగాహన ఉండాలి. అలా చిన్న చిన్న మార్పులు చేసుకోవడం వల్ల గతంలో కంటే ఎక్కువ డబ్బులు కూడ బెట్టుకోవడానికి ఆస్కారం ఉంటుంది.. అయితే డబ్బులు ఆదా చేయడానికి ఎలాంటి టిప్స్ పాటించాలి అనేది మనం ఇప్పుడు చదివి తెలుసుకుందాం..

1.సబ్ స్క్రిప్షన్ :
సాధారణంగా ఈ మధ్య కాలంలో ఏ యాప్ వాడాలన్నా సరే ఏ ఓటీటీ చూడాలన్నా సరే సబ్స్క్రిప్షన్ తప్పనిసరి అయిపోయింది. అయితే మీరు రకరకాల యాప్ లు,  మ్యాగజైన్లను సబ్స్క్రిప్షన్ చేసుకున్నట్లయితే చాలా డబ్బు వృధా అవుతుంది. మీరు దేనిని చూడాలనుకుంటున్నారో దానిని మాత్రమే సబ్స్క్రిప్షన్ చేసుకోవడం వల్ల ఎక్కువ డబ్బులు మిగులుతాయి. మీకు అవసరం లేని వాటిని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిన అవసరం లేదు.

2. షాపింగ్ :
మనకు పూట గడవాలి అంటే అందుకు కావలసిన వస్తువులు మన ఇంట్లో తప్పకుండా ఉండాలి. అందువల్ల ప్రతి నెల మనము  ఇంటి అవసరాలకు ఏ గ్రోసరీ  ఉపయోగపడతాయో కొనుగోలు చేస్తూ ఉంటాము. షాపింగ్ చేయడానికి బయలుదేరే ముందు ఖచ్చితంగా మీరు ఇంట్లోకి ఏమేమి కావాలో వాటన్నింటినీ ఒక లిస్టు రాసుకొని వెళ్తే డబ్బు కూడా ఆదా అవుతుంది.

3. ఇన్వెస్ట్మెంట్:
మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన వాళ్ళు వీలైనంతవరకు తక్కువ మొత్తంలో అయినాసరే డబ్బు దాచుకోవాలి.. ఖర్చులకు పోను మిగిలిన ఎంత డబ్బు ఉందో దానిని వివిధ రకాల స్కీమ్లో పెట్టుబడులు పెట్టవచ్చు. మీరు పెట్టే డబ్బుకు ఎక్కడ ఎక్కువ రాబడి వస్తుందో దానిని తెలుసుకొని ఇన్వెస్ట్ చేయడం వల్ల మరింత లాభాలు కలుగుతాయి.

4. అవుట్ సైడ్ ఫుడ్:
చాలామంది బయటకు వెళ్లి ఫాస్ట్ ఫుడ్ తినాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇలా చేయడం వల్ల డబ్బు వృథా అవ్వడమే కాకుండా ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది.. అందుకే బయట తినడం మానేస్తే డబ్బు మిగలడ మే కాకుండా మీ ఆరోగ్యం కూడా చాలా దృఢంగా మారుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: