మనీ: శుభవార్త తెలిపిన మోడీ.. వారి ఖాతాలో ఏకంగా రూ.12 వేలు జమ..!!

Divya
మోదీ సర్కార్ దేశవ్యాప్తంగా ఉన్న అందరి రైతులకు ఆర్థిక భరోసా కల్పించడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం అందించే ప్రధానమంత్రి సన్మాన్ నిధి కింద ప్రతి సంవత్సరం అన్నదాతలకు ఆరు వేల రూపాయలను తమ ఖాతాల ద్వారా పొందుతున్న విషయం తెలిసిందే.. కానీ ఈ దీపావళి పండుగ సందర్భంగా రైతుల కోసం పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన మొత్తాన్ని రెట్టింపు చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం..
అంటే ప్రతి ఏడాది కేంద్రం తరఫున ఆరు వేల రూపాయలను మూడు విడతలుగా కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న విషయం తెలిసిందే.. ఇప్పుడు దానిని రెట్టింపు అంటే ఆరు వేలకు బదులుగా 12 వేల రూపాయలను రైతులకు ఇవ్వబోతోంది మోడీ ప్రభుత్వం. ఇకపోతే మూడు విడతల్లో రూ. 2000 చొప్పున ఇస్తున్న మోడీ ప్రభుత్వం ఇప్పుడు నాలుగు వేల రూపాయలను మూడు విడతలుగా ఇవ్వనున్నారు.. ఇంకా ఈ దీపావళి నాటికి ఈ విషయాన్ని మోడీ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించనున్నారు.

ఇకపోతే డిసెంబర్ 15వ తేదీన రైతులకు పదవ విడత నగదు తమ ఖాతాల్లో జమ చేయనున్నట్లు సమాచారం.. ఇప్పటికే భారతదేశంలో 11.37 కోట్ల మంది రైతులు.. కేంద్ర ప్రభుత్వం నుంచి రూ. 1.58 లక్షల కోట్లను పొందారు. ఇకపోతే 2021 డిసెంబర్ 15వ తేదీ నాటికి రైతుల ఖాతాల్లో నగదు జమ చేయబడుతుంది. ఇకపోతే గతేడాది 2020 డిసెంబర్ 25వ తేదీన రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేసిన కేంద్ర ప్రభుత్వం ఈసారి 10 రోజుల ముందుగానే  రైతుల ఖాతాల్లో డబ్బు జమ కానున్నాయి.
ఇకపోతే చివరి విడత మొత్తాన్ని ఎవరైతే తీసుకోలేదో వాళ్లు ఇప్పుడు ఈ విడత తో పాటుగా మొత్తం నాలుగు వేల రూపాయలను వారి ఖాతాలో పొందవచ్చు. ఇక ఎవరెవరు ఈ పథకం కింద డబ్బులు పొందుతున్నారో వారి పేర్లు కూడా అక్టోబర్ 30 2021 వ తేదీన ప్రకటించనుంది కేంద్ర ప్రభుత్వం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: