"సూర్య 42" తర్వాత ఆ రెండు మూవీలే..?

Pulgam Srinivas
తమిళ సినిమాల ద్వారా సూపర్ క్రేజ్ ను సంపాదించుకున్న సూర్య గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సూర్య తమిళ్ తో పాటు తెలుగు లోనూ మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. మురుగదాస్ దర్శకత్వంలో రూపొందిన గజిని మూవీ ని తెలుగు లో విడుదల చేసి అద్భుతమైన క్రేజ్ ను సంపాదించుకున్న ఈ హీరో ఆ తర్వాత తాను నటించిన దాదాపు ప్రతి మూవీ ని కూడా తెలుగు లో విడుదల చేశాడు.

అందులో కొన్ని మూవీ లు టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ విజయాలను అందుకోవడంతో సూర్య ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ లో ఫుల్ క్రేజ్ ఉన్న హీరో గా కెరీర్ ను కొనసాగిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం సూర్య తన కెరీర్ లో 42 వ మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. శివ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీ లో దిశా పటాని హీరోయిన్ గా నటిస్తుంది. ఈ మూవీ ని సూర్య కెరియర్ లోనే భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఈ మూవీ ని పాన్ ఇండియా మూవీ గా విడుదల చేయనున్నారు.

ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ ఫుల్ స్పీడ్ లో జరుగుతుంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ తర్వాత సూర్య , సుధా కొంగర దర్శకత్వంలో రూపొందబోయే మూవీ లో హీరో గా నటించబోతున్నాడు. ఇది వరకే వీరిద్దరి కాంబినేషన్ లో సూరారై పొట్రు మూవీ తరకెక్కింది. ఈ మూవీ కి ప్రేక్షకుల నుండి ... విమర్శకుల నుండి అద్భుతమైన ప్రశంసల లభించడంతో వీరిద్దరి కాంబినేషన్ లో రూపొందబోయే తదుపరి మూవీ పై ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఈ మూవీ తర్వాత సూర్య ఆల్రెడీ మొదలు పెట్టి ఆపిన సినిమా  వాడి వాశల్ కూడా మళ్ళీ రీస్టార్ట్ చేయనున్నట్టుగా తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: