పొన్నియన్ సెల్వన్ 2 ఇప్పట్లో విడుదల కాదా...?

murali krishna
మణి రత్నం తెరకెక్కించిన పోన్నియన్ సెల్వన్ అందరూ అనుకున్నట్లే తమిళంలో మినహా ఎక్కడ కూడా ఆడని పరిస్థితి ఎదురైంది.తమిళ వారికి ఎంతో ప్రాముఖ్యత ఉన్న సినిమా అయినప్పటికీ కూడా మిగతా భాషల వారికి ఈ చిత్రం పెద్దగా అయితే ఎక్కలేదు వాస్తవానికి పొన్నియన్ సినిమాకు మంచి చరిత్ర అయితే ఉంది కానీ అది మిగతా వారికి అంతగా తెలియదు.
ఇక బాలీవుడ్ వారికైతే తెలిసే అవకాశం కూడా లేదు అందుకే ఆ పేర్లు కానీ వారి వస్త్రధారణ గాని అర్థం కాక జుట్టు పీక్కున్నారట.మణిరత్నం తన జీవిత ఆశయంగా పెట్టుకొని ఈ సినిమా తీస్తున్న సంగతి కూడా మన అందరికీ తెలిసిందే. ఇప్పటికే వచ్చిన మొదటి పార్ట్ కు తమిళంలో అత్యధిక వసూళ్లును సాధించిన సినిమాలు జాబితాలో అయితే చేరింది కానీ తమిళం మినహా మిగతా భాషల్లో ఈ చిత్రం క్లియర్ ఫ్లాప్ అని చెప్పాలి.
అయితే ఈ సినిమాకు సంబంధించిన ఆ రెండవ భాగం షూటింగ్ కూడా దాదాపుగా మొదటి పార్ట్ తోనే పూర్తి చేశాడు దర్శకుడు. ఎడిటింగ్ డబ్బింగ్ లాంటి పోస్ట్ ప్రొడక్షన్ మినహా షూటింగ్ పార్ట్ దాదాపుగా అయితే పూర్తయింది. ఏప్రిల్ 18 వ తారీఖున ఈ సినిమా రెండవ పార్ట్ ను విడుదల చేయాలని మొదటి పార్ట్ విడుదలవుతున్న సమయంలోనే ప్రకటించేశారటా. కానీ సినిమా రషెస్ చూసిన మణిరత్నం కి చాలా వరకు సీన్స్ నచ్చడం లేదని తెలుస్తుంది.ఈ సినిమాలో దాదాపు ఐశ్వర్యరాయ్ మినహా మిగిలిన వారందరూ తమిళ భాషకు సంబంధించిన వారే అని చెప్పాలి.. అయితే మణిరత్నం ఆశిస్తున్న సీన్స్ మళ్లీ రీ షూట్ చేయాలంటే చాలా గందరగోళ పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. చాలా పెద్ద క్యాస్టింగ్ కాబట్టి అందరు డేట్స్ దొరకడం కష్టంతో కూడుకున్న పని అని తెలుస్తుంది.. పైగా మొదటి భాగం అనుకున్నంత రేంజ్ లో ఆడలేదు తమిళ వెర్షన్ మినహా మిగతా భాషల డబ్బింగ్ పై దర్శకుడు ఏమాత్రం కూడా దృష్టి పెట్టలేదు. ఇక రెండవ భాగంపై జనాల్లో పెద్దగా ఆసక్తి అయితే లేదు కానీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమిళనాడు భాగం ఎప్పుడు వస్తుందా అని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దాంతో మణిరత్నం ఈ సినిమాను ఇప్పట్లో విడుదల చేసే ఆలోచనను విరమించు కున్నట్లు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: