చిరు Vs బాలయ్య: ఎవరిది పైచేయి?

Purushottham Vinay
టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలు అయిన నందమూరి బాలకృష్ణ, మెగాస్టార్ చిరంజీవిల మధ్య పోటీ ఎన్నో సంవత్సరాల నుంచి ఉంది. ఇక బాల కృష్ణ హీరోగా నటిస్తున్న వీర సింహారెడ్డి అలాగే మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న వాల్తేరు వీరయ్య సినిమాలు సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదలవుతున్న సంగతి తెలిసిందే.ఇక వీర సింహారెడ్డి సినిమా జనవరి 12 వ తేదీవ  విడుదలవుతుండగా,  వాల్తేరు వీరయ్య సినిమా జనవరి 13వ తేదీన విడుదలవుతోంది. ఇక ఇద్దరు స్టార్ హీరోలు తమ సినిమాలతో చాలా కాలం తర్వాత బాక్స్ ఆఫీస్ వద్ద పోటీ పడుతూ ఉండడంతో అందరికీ ఈ సినిమాల మీద ఎంతగానో ఆసక్తి నెలకొంది. ఇక ఫ్యాన్స్ అయితే ప్రతి విషయంలో కూడా ఈ రెండు సినిమాలను కంపేర్ చేస్తున్నారు. తాజాగా ఈ రెండు సినిమాలకు సంబంధించిన ట్రైలర్స్ విడుదల అవ్వగా 24 గంటల్లో ఏ సినిమా ట్రైలర్ కి ఎంత రెస్పాన్స్ దక్కించుకుంది అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద హాట్ టాపిక్ గా మారింది.


అయితే వాల్తేరు వీరయ్య సినిమా ట్రైలర్ వీర సింహారెడ్డి ట్రైలర్ కంటే చాలా ఎక్కువ రెస్పాన్స్ దక్కించుకోని యూట్యూబ్ ట్రెండింగ్ లో నెంబర్ 1 గా నిలిచింది.అయితే ఓవర్సీస్ రిలీజ్ విషయంలో మాత్రం వీర సింహారెడ్డి సినిమా , వాల్తేరు వీరయ్య సినిమా కంటే కాస్త ముందు ఉంది అనే చెప్పాలి. వీర సింహారెడ్డి వాల్తేరు వీరయ్య సినిమా కంటే ఎక్కువ లొకేషన్స్ లో రిలీజ్ అవుతుంది.ఇంకా అలాగే ఆ లొకేషన్స్ లో  ఎక్కువ టికెట్లు వాల్తేరు వీరయ్య సినిమా కంటే వీరసింహారెడ్డి సినిమానే దక్కించుకోవడం గమనార్హం. మెగా అభిమానులు తమ ట్రైలర్  రెస్పాన్స్ తో తమ హీరో పేరిట రికార్డులు నమోదు చేస్తుంటే బాలకృష్ణ అభిమానులు మాత్రం సినిమా టికెట్లు కొనే పనిలో ఉన్నారు. నందమూరి బాలకృష్ణ సినిమాని అలాగే మెగాస్టార్ చిరంజీవి సినిమాని ఈ రెంటిని కూడా movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మించింది. బాలకృష్ణ సినిమా డిసెంబర్ నెలలోనే విడుదల కావాల్సి ఉండగా పలు కారణాలతో ఈ సినిమా వాయిదా పడుతూ చివరికి సంక్రాంతికి రిలీజ్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: