వాల్తేరు వీరయ్య చిత్రంలో విలన్ అప్డేట్..!!

Divya
చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సినిమా సంక్రాంతికి చాలా గ్రాండ్గా విడుదల కాబోతోంది.ఈ సినిమాకు సంబంధించి తాజా అప్డేట్ అంచనాలను పెంచేస్తున్నారు చిత్ర బృందం. ఇప్పటికే విడుదలైన సాంగ్స్, టీజర్స్ డైలాగ్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి.ముఖ్యంగా వాల్తేర్ వీరయ్య లోని టైటిల్ సాంగ్ ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటోంది. ఇక డైరెక్టర్ బాబి కూడా ఈ సినిమాని విడుదల చేసేందుకు చాలా ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. రీసెంట్గా చిత్ర బృందం ఒక ప్రత్యేకమైన ప్రెస్ మీట్ పెట్టి చాలా హడావిడి చేసింది. దీంతో ఈ సినిమా హైట్ కూడా భారీగానే పెరిగిపోతుంది.

ఈ చిత్రంలో రవితేజ పాత్ర కూడా చాలా ఎక్కువగా ఉన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. తప్పకుండా వీరీ కలయికలో వచ్చిన ఈ మాస్ సినిమా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుందని చెప్పవచ్చు. ఈ సినిమాలో మెయిన్ విలన్ గా ఉండబోతున్న వారు కూడా చాలా పవర్ ఫుల్ గా కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఇక సీనియర్ యాక్టర్ ప్రకాష్ రాజు కూడా అద్భుతమైన పాత్రలో కనిపించబోతున్నట్లు సమాచారం. తమిళంలో ప్రముఖ నటుడు బాబి సింహ కూడా ఈ చిత్రంలో ఒక పవర్ఫుల్ క్యారెక్టర్ తో చిరంజీవితో పోటీ పడబోతున్నట్లు సమాచారం.

వైజాగ్ బ్యాక్ డ్రాప్ లు తెరపైకి వస్తున్న ఈ చిత్రం సెకండాఫ్ లో వచ్చే కొన్ని యాక్షన్స్ అన్ని వేషాలు డైలాగులు ప్రేక్షకులను బాగా ఆకట్టుకునేలా ఉంటాయని చిత్ర బృందం తెలియజేస్తోంది. ముఖ్యంగా బాబి సింహ పాత్ర కూడా ఈ సినిమాకి మరింత ప్లస్ కాబోతోందని సమాచారం ఇక చిరంజీవి ,రవితేజ రెండు పాత్రలు కూడా ఈ సినిమా యాక్షన్ సినిమా అని చెప్పడానికి సరిపోతుందని చిత్ర బృందం భావిస్తోంది మరి ఈ సినిమా క్యాస్టింగ్ ద్వారా ఏ స్థాయిలో కలెక్షన్లను రాబడుతుందో చూడాలి మరి. మరి సంక్రాంతికి విడుదల అవుతున్న చిత్రాలలో ఏది విజయాన్ని అందుకుంటుందో తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: