"తునీవు" ఓవర్సీస్ హక్కులు ఆ సంస్థకు... అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా వచ్చేసింది..!

Pulgam Srinivas
కోలీవుడ్ ఇండస్ట్రీ లో టాప్ హీరో లలో ఒకరు అయినటు వంటి ఆజిత్ ప్రస్తుతం తునీవు అనే మూవీ లో హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసింది. ఈ మూవీ కి హెచ్ వినోద్ దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ ఫుల్ స్పీడ్ లో జరుగుతుంది. కొన్ని రోజుల క్రితమే ఈ మూవీ నుండి చిత్ర బృందం అజిత్ కు సంబంధించిన కొన్ని పోస్టర్ లను విడుదల చేసింది. ఈ పోస్టర్ లలో అజిత్ అదిరిపోయే స్టైలిష్ లుక్ లో ఉండడం తో ఈ మూవీ పై అజిత్ అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు  తునీవు మూవీ ని 2023 వ సంవత్సరం పొంగల్ కానుకగా విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం కొన్ని రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించింది. కాక పోతే ఈ మూవీ ని ఏ తేదీన విడుదల చేయబోతున్నారు అనే విషయాన్ని మాత్రం మూవీ యూనిట్ ఇప్పటి వరకు ప్రకటించ లేదు.
 

మరి కొన్ని రోజుల్లోనే ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఈ మూవీ విడుదల సమయం దగ్గర పడడంతో ఇప్పటికే తునీవు మూవీ యూనిట్ ఈ సినిమా ఫ్రీ రిలీజ్ బిజినెస్ ను క్లోజ్ చేసే పనిలో బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా ఇప్పటికే ఈ మూవీ ఓవర్సీస్ హక్కులను మూవీ యూనిట్ అమ్మివేసింది. తాజాగా ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది. తునీవు మూవీ ఓవర్సీస్ హక్కులను లైకా ప్రొడక్షన్స్ సంస్థ వారు దక్కించుకున్నారు. తాజాగా ఈ విషయాన్ని ఈ సంస్థ అధికారికంగా ప్రకటించింది. ఇది ఇలా ఉంటే తునీవు మూవీ పై తమిళ ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. మరి ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఏ రేంజ్ విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: