ప్రమోషన్స్ లో దుమ్ము రేపుతున్న అల్లు శిరీష్!!

P.Nishanth Kumar
అల్లు హీరోగా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన అల్లు శిరీష్ హీరోగా ఇప్పటిదాకా నిలబెట్టుకోక పోవడం నిజంగా అందరినీ ఆశ్చర్య పరిచే విషయం అనే చెప్పాలి. కారణం ఏదైనా కూడా అన్న సూపర్ స్టార్ అయి ఉండి, తండ్రి అగ్ర నిర్మాత అయినా కూడా అల్లు శిరీష్ కనీసం చిన్న హీరో గా నైనా కూడా నిల దొక్కుకో క పోవడం ఆయనను ఎంతగానో అవమానపరిచే విషయం అని చెప్పాలి. ఆ విధంగా అల్లు శిరీష్ ఈ ఏడాది మరొకసారి తన అదృష్టం పరీక్షించుకోవడం కోసం ఓ ప్రేమ కథ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఊర్వశివో రాక్షసివో అనే టైటిల్ తో రాబోతున్న ఈ సినిమా వచ్చే నెలలో విడుదల కాబోతుంది. 

అందాల కథనాయకగా మంచి పేరు క్రేజ్ సంపాదించుకున్న అను ఇమ్మానుయేల్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తూ ఉండడం సినిమా పట్ల ఇంతటి స్థాయిలో అంచనాలు పెరగడానికి కారణం అవుతుంది. తొలి సినిమా నుంచి మంచి అభినయంతో పాటు గ్లామర్ షో కూడా ప్రదర్శిస్తూ ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు ఈ సినిమా ద్వారా మళ్ళీ ఫామ్ లోకి రావాలని భావిస్తుంది. మొదటి నుంచి మంచి అభినయం, గ్లామర్ కనబరిచిన కూడా ఈమె సినిమాలు హిట్ కాకపోవడంతో ఎక్కువ మంది దర్శక నిర్మాతలు ఈమెకు అవకాశాలు ఇవ్వలేకపోయారు. ఫైనల్ గా ఈమె తో అల్లు శిరీష్ సినిమా చేయడం ఇద్దరికీ చాలా ముఖ్యమైనదని చెప్పాలి.

ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన చాలా అప్డేట్లు అందరినీ ఎంతగానో అలరించాయి. రొమాన్స్ ప్రధానంగా ఈ సినిమా రూపొందుతుంది అని ఇటీవల విడుదలైన టీజర్ ను బట్టి చెప్పవచ్చు. కంటెంట్ కూడా బాగా ఉంటుంది అని కూడా చెబుతున్నారు. చాలా రోజుల తర్వాత అల్లు శిరీష్ ఎంతగానో నమ్మి చేస్తున్న ఈ సినిమా ఆయనకు మంచి విజయం తెచ్చిపెట్టారని భావిస్తున్నారు. ఏదేమైనా అల్లు శిరీష్ నవంబర్ 4వ తేదీన ఈ సినిమాతో ప్రేక్షకులను పలకరిస్తున్న నేపథ్యంలో ఆ చిత్రం ఏ స్థాయిలో ఉంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: