గాడ్ ఫాదర్ కి సల్మాన్ ఒక్క రూపాయి కూడా తీసుకోలేదట?

Purushottham Vinay
టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ తో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కు వున్న అనుబంధం గురించి చెప్పాల్సిన పనిలేదు. మెగాఫ్యామిలీతో సల్మాన్ ఖాన్ ఎంతో చనువుగా మెలుగుతారు.చిరంజీవి ఇంకా రామ్ చరణ్ లతో సల్మాన్ ఖాన్ ఎంతో స్నేహంగా ఉంటారు.ఇక సల్మాన్ ఖాన్ ఎప్పుడు హైదరాబాద్ వచ్చినా మెగాస్టార్ ఇంట అతిధ్యం తప్పనిసరి. వ్యక్తిగత పనులు మీద వచ్చినా...షూటింగ్ నిమిత్తం వచ్చినా చిరంజీవి ఇంట్లో లంచ్..డిన్నర్ లాంటివి తప్పనిసరిగా తీసుకోవాల్సిందే.లేదంటే ఆ కుటుంబం సల్మాన్ ని అస్సలు విడిచిపెట్టదు. అంతటి బాండింగ్ కొన్నేళ్లగా కొనసాగుతుంది. ఆ స్నేహంతోనే రామ్ చరణ్ గాడ్ ఫాదర్ లో చిన్న పాత్ర ఉంది నటించాలి అని కోరగా మరో మాట లేకుండా ఒప్పుకున్నారు. కథ..అందులో తన పాత్ర ఎలా ఉంటుంది? అని కూడా అడగకుండా ఒకే చేసారు. ఒకే ఒక్క ఫోన్ కాల్ తో సల్మాన్ ఖాన్ హైదరాబాద్ లో దిగిపోయారు.తన పాత్ర షూటింగ్ పూర్తి చేసుకుని వెళ్లిపోయారు.


మరి ఈ సినిమాకి సల్మాన్ ఖాన్ ఎంత ఛార్జ్ చేసినట్లు? ఒక్కో హిందీ సినిమాకు కోట్ల రూపాయలు పారితోషికం తీసుకుంటారు? సినిమాలో వాటా సైతం తప్పనిసరి? మరి అలాంటి సల్మాన్ ఖాన్ `గాడ్ ఫాదర్` కోసం కూడా భారీగానే ఛార్జ్ చేసి ఉంటారని అంతా భావించొచ్చు. కానీ ఈ సినిమా కోసం సల్మాన్ ఒక్క రూపాయి కూడా పారితోషికం తీసుకోలేదు.ఈ విషయాన్ని స్వయంగా మెగాస్టార్ చిరంజీవి ఓ ఇంటర్వ్యూలో రివీల్ చేసారు. సల్మాన్ ఖాన్ తో పారితోషికం గురించి మాట్లాడమని హైదరాబాద్ నుంచి ముంబైకి ఒక వ్యక్తిని పంపిచాను. కానీ అలా పంపించినందకు ఆయన ఎంతో బాధపడ్డారు. ఇలాంటివి వద్దు వదిలేయండని చిరంజీవికి వెంటనే సల్మాన్ ఖాన్ ఫోన్ చేసి చెప్పారట. దీన్ని బట్టి మెగా ఫ్యామిలీ అంటే సల్మాన్ ఎంత ప్రాధాన్యత ఇస్తారు? అన్నది మరోసారి తెలిసిపోతుంది.ఎలాంటివి ఆశించకుండా కేవలం మెగాస్టార్ కోసమే సల్మాన్ ఖాన్ సినిమా చేసాడట. దీంతో చిత్ర నిర్మాతలకు కోట్ల రూపాయలు ఆదా అయినట్లే. సల్మాన్ ఖాన్ పోషించింది గెస్ట్ పాత్ర అయినా ఆయన బ్రాండ్ తోనే పెద్ద ఎత్తున మార్కెట్ జరగడానికి అవకాశం ఉంది. పైగా సినిమా హిందీలో కూడా రిలీజ్ అవుతుంది కాబట్టి అక్కడ మార్కెట్ పరంగా సల్మాన్ ఖాన్ ఎంట్రీ కీలక పాత్ర పోషిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: