వాడికి అది తప్పా ఇంకేం రాదు.. దగ్గుబాటి హీరోపై శ్రీరెడ్డి షాకింగ్ కామెంట్స్..?

Anilkumar
శ్రీ రెడ్డి.... ఈ పేరు తెలియని వారుండరనుకోండి...ఇక శ్రీ రెడ్డి చూపించిన తెగువ అందరికీ స్పూర్తినిచ్చేలా ఉంటుంది.ఆమె మీటూ, క్యాస్టింగ్ కౌచ్ ఉద్యమాన్ని నడిపించిన తీరు, చేసిన పనులు, మాట్లాడిన మాటలు కాస్త అదుపుతప్పినా కూడా.. సమస్య మాత్రం ఉందని అందరికీ అర్థమైంది. అయితే టాలీవుడ్‌లో క్యాస్టింగ్ కౌచ్ బాధితులంతా ఒక్కొక్కరిగా బయటకు వచ్చారు.ఇక  తమకు జరిగిన అన్యాయాల గురించి చెప్పారు. అంతేకాదు శ్రీ రెడ్డి చేసిన ఉద్యమంతో అందరిలోనూ కదలిక వచ్చింది.ఇక  ఫిల్మ్ ఛాంబర్ ముందు అర్దనగ్న ప్రదర్శన చేయడంతో జాతీయ స్థాయిలో శ్రీ రెడ్డి పేరు ఒక్కసారిగా హాట్ టాపిక్ అయింది. ఈమె  వల్లే దగ్గుబాటి అభిరామ్ వార్తల్లో నిలిచాడు. 

ఇక అలాంటి శ్రీ రెడ్డి తాజాగా  ఒక టీవీ ఛానెల్ కి ఇంటర్వ్యూ ఇచ్చింది.ఇక దగ్గుబాటి అభిరామ్ తనను వాడుకున్నాడని, అవకాశాలు ఇప్పిస్తాను అని చెప్పి సర్వం దోచుకున్నాడని, అవసరాలు తీరాక తనను వదిలేశాడంటూ శ్రీ రెడ్డి ఆరోపణలు చేసింది.  మీడియా ముందే.. అభిరామ్‌తో సన్నిహితంగా ఉన్న ఫోటోలను, సెల్ఫీలను షేర్ చేసింది. ఇక శ్రీ రెడ్డి ఎపిసోడ్ వల్లే అభిరామ్ వార్తల్లో వైరల్ అయ్యాడు.  అభిరామ్ నుంచి స్పందన మాత్రం రాలేదు. కాగా మీడియాను అభిరామ్ ఎదుర్కోలేదు.  అభిరామ్ ఎంట్రీ గురించి తాజాగా శ్రీ రెడ్డి జీ తెలుగు న్యూస్‌తో ముచ్చటించింది.అయితే అభిరామ్ కొత్త సినిమా అహింస ప్రస్థావన రాగానే శ్రీ రెడ్డి తన స్టైల్లో రియాక్ట్ అయ్యారు.ఇక  శ్రీ రెడ్డి దగ్గుబాటి అభిరామ్, 

అహింస సినిమా గురించి మాట్లాడుతూ గాలి తీసేసింది. అంతేకాదు అహింసనా? నేను అస్సలు వినలేదు.. అయినా వాడికి హింస తప్ప ఇంకేం రాదు.. అహింస అనే సినిమాతో వస్తున్నాడా? అన్న టైపులో కౌంటర్లు వేసింది. అంతేకాకుండా వస్తే రానివ్వండి.. చాలా సినిమాలు వస్తున్నాయ్.. పోతోన్నాయ్.. ఇది ఏ మాత్రం అడుతుందో చూద్దాం అన్నట్టుగా వెటకారంగా కామెంట్లు వేసింది.శ్రీ రెడ్డి వైసీపీ, మెగా ఫ్యామిలీ, సోషల్ మీడియాలో జరుగుతున్న ట్రోలింగ్ ఇలా అన్నింటి మీదా స్పందించింది.అయితే  బిగ్ బాస్ షో మీద కూడా మరోసారి తన స్టైల్లో నిప్పులు చెరిగింది.ఆమె... అదో షోనా? అన్నట్టుగా కౌంటర్లు వేసింది. చస్తే ఆ షోకు వెళ్లను.. ఉన్న పరువును పోగొట్టుకోవడమే అన్నట్టుగా బిగ్ బాస్ మీద తనకున్న వ్యతిరేకతను మరోసారి ప్రదర్శించింది శ్రీ రెడ్డి. ఇక ప్రస్తుతం శ్రీ రెడ్డి యూట్యూబ్ వీడియోలతో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోన్న సంగతి తెలిసిందే.అంతేకాదు  వెరైటీ వంటకాలను రుచి చూపిస్తూ తన అభిమానులను ఆకట్టుకుంటోంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: