షాకింగ్‌: హరీశ్‌రావుపై బీఆర్ఎస్‌లో కుట్ర?

Chakravarthi Kalyan
హరీశ్‌రావుపై బీఆర్ఎస్‌లో కుట్ర జరుగుతోందా.. మాజీ సీఎం కేసీఆర్‌, మాజీ మంత్రి కేటీఆర్‌లు మాజీ మంత్రి హరీష్‌ రావును బయటకు పంపే పనిలో ఉన్నారా అంటే అవునంటున్నారు పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్‌ రెడ్డి. ఆగస్టు 15న ఫామ్‌ హౌస్‌కు వెళ్లేందుకు మూటముల్లె సర్దుకుని సిద్దంగా ఉండాలని హరీష్‌రావుకు పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్‌ రెడ్డి సూచించారు. హరీష్‌ రావు స్థాయికి మించి మాట్లాడుతున్నారని సీఎంతో సవాల్‌ చేసే స్థాయి హరీష్‌రావుకు లేదని పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్‌ రెడ్డి ధ్వజమెత్తారు.

ఆగస్టు నెలలో ఏకకాలంలో 2లక్షల రుణమాఫీ చేస్తామని ఇచ్చిన హామీ అమలు చేసి తీరుతామని రామ్మోహన్‌ రెడ్డి స్పష్టం చేశారు. గడిచిన పదేండ్ల పాలనలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం తెలంగాణను ఆగం చేసిండ్రని రామ్మోహన్‌ రెడ్డి ఆరోపించారు. కొత్తగా ప్రభుత్వం ఏర్పడిన నాలుగు నెలలకే ఆగుతలేరని, 15 రోజులకే రోడ్డెక్కిండ్రని రామ్మోహన్‌ రెడ్డి విమర్శించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: