తెలంగాణ కాంగ్రెస్‌ రెడ్డీల సొంతమేనా?

Chakravarthi Kalyan
లోక్ సభ సీట్లలో కాంగ్రెస్ పార్టీ  సామాజిక న్యాయం పాటించలేదని బీఆర్‌ఎస్‌ నేతలు ఆరోపిస్తున్నారు. బీసీలకు కాంగ్రెస్‌ అన్యాయం చేసిందని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ నేత పొన్నాల లక్ష్మయ్య ఆరోపించారు. తొమ్మిది సీట్లు అగ్రవర్ణాలు వారికి కేటాయించారని, అందులో ఆరు సీట్లు ఒకే సామాజిక వర్గానికి కేటాయించారని పొన్నాల లక్ష్మయ్య అన్నారు. కాంగ్రెస్ పార్టీ మూడు సీట్లను మాత్రమే బీసీలకు కేటాయించిందని, కేసీఆర్  బీసీలకు అత్యధిక సీట్లు కేటాయించారని పొన్నాల లక్ష్మయ్య పేర్కొన్నారు. రాజకీయంగా న్యాయం చేయలేని కాంగ్రెస్... బీసీలకు ఎలా న్యాయం చేస్తుందని పొన్నాల లక్ష్మయ్య ప్రశ్నించారు.

కృష్ణా ప్రాజెక్టులను తీసుకొని పోయి కేఆర్ఎంబీకి అప్పజెప్పారని, ట్రైబ్యునల్ వద్ద మనం నీటి వాటా గురించి మాట్లాడలేదని పొన్నాల లక్ష్మయ్య ఆక్షేపించారు. రైతులు పండించిన ధాన్యాన్ని ఎందుకు కొనడం లేదో ప్రభుత్వం ఎందుకు  సమాధానం చెప్పడం లేదని పొన్నాల లక్ష్మయ్య అడిగారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: