సింగపూర్‌ ఎయిర్‌లైన్స్‌కు చుక్కలు చూపించిన తెలంగాణ డీజీపీ?

Chakravarthi Kalyan
తెలంగాణ డీజీపీ రవిగుప్తా సింగపూర్‌ ఎయిర్‌లైన్స్‌కు చుక్కలు చూపించారు. సరైన సేవలు అందించనందుకు సింగపూర్‌ ఎయిర్‌లైన్స్‌కు భారీ జరిమానా వేయించారు. ఆయన ఫిర్యాదుతో జిల్లా వినియోగదారుల కమిషన్‌ భారీ జరిమానా విధించింది. తెలంగాణ డీజీపీ రవిగుప్తా ఫిర్యాదు మేరకు విచారణ జరిపిన కమిషన్... డీజీపీ, ఆయన భార్యకు కలిపి 2 లక్షలు చెల్లించాలని ఆదేశించింది.
ఇంతకీ ఏమైందంటే.. గతేడాది మే 23 న రవిగుప్తా తన భార్య అంజలి గుప్తాతో కలిసి హైదరాబాద్‌ నుంచి సింగపూర్‌ మీదుగా ఆస్ట్రేలియా వెళ్లారు. అందుకు బిజినెస్‌ క్లాస్‌లో రిక్లైనర్‌ సీట్లు బుక్‌ చేసుకున్నారు. కాగా ప్రయాణ సమయంలో రిక్లైనర్‌ సీట్లలో ఎలక్ట్రానిక్ కంట్రోల్‌ విఫలమవడం వల్ల ప్రయాణ సమయమంతా మెలుకువగా ఉండాల్సి వచ్చింది. బిజినెస్‌ క్లాస్ టికెట్లతో ఎకానమీ ప్రయాణానుభవం పొంది ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దీంతో డీజీపీ రవిగుప్తా జిల్లా వినియోగదారుల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. డీజీపీతో పాటు ఆయన భార్యకు కలిగిన అసౌకర్యానికి గాను ఇద్దరికీ కలిపి టికెట్ల సొమ్ము 97 వేల 500 రూపాయలు, ఇద్దరికీ ఒక్కో లక్ష చొప్పున మొత్తంగా 2 లక్షలు జరిమానా, ఫిర్యాదు చేసేందుకు అయిన ఖర్చులకు గాను 10వేలు ఇవ్వాలని సింగపూర్‌ ఎయిర్‌లైన్స్‌ను ఆదేశించింది.తెలంగాణ డీజీపీ రవిగుప్తా సింగపూర్‌ ఎయిర్‌లైన్స్‌కు చుక్కలు చూపించారు. సరైన సేవలు అందించనందుకు సింగపూర్‌ ఎయిర్‌లైన్స్‌కు భారీ జరిమానా వేయించారు. ఆయన ఫిర్యాదుతో జిల్లా వినియోగదారుల కమిషన్‌ భారీ జరిమానా విధించింది. తెలంగాణ డీజీపీ రవిగుప్తా ఫిర్యాదు మేరకు విచారణ జరిపిన కమిషన్... డీజీపీ, ఆయన భార్యకు కలిపి 2 లక్షలు చెల్లించాలని ఆదేశించింది.
ఇంతకీ ఏమైందంటే.. గతేడాది మే 23 న రవిగుప్తా తన భార్య అంజలి గుప్తాతో కలిసి హైదరాబాద్‌ నుంచి సింగపూర్‌ మీదుగా ఆస్ట్రేలియా వెళ్లారు. అందుకు బిజినెస్‌ క్లాస్‌లో రిక్లైనర్‌ సీట్లు బుక్‌ చేసుకున్నారు. కాగా ప్రయాణ సమయంలో రిక్లైనర్‌ సీట్లలో ఎలక్ట్రానిక్ కంట్రోల్‌ విఫలమవడం వల్ల ప్రయాణ సమయమంతా మెలుకువగా ఉండాల్సి వచ్చింది. బిజినెస్‌ క్లాస్ టికెట్లతో ఎకానమీ ప్రయాణానుభవం పొంది ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దీంతో డీజీపీ రవిగుప్తా జిల్లా వినియోగదారుల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. డీజీపీతో పాటు ఆయన భార్యకు కలిగిన అసౌకర్యానికి గాను ఇద్దరికీ కలిపి టికెట్ల సొమ్ము 97 వేల 500 రూపాయలు, ఇద్దరికీ ఒక్కో లక్ష చొప్పున మొత్తంగా 2 లక్షలు జరిమానా, ఫిర్యాదు చేసేందుకు అయిన ఖర్చులకు గాను 10వేలు ఇవ్వాలని సింగపూర్‌ ఎయిర్‌లైన్స్‌ను ఆదేశించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

dgp

సంబంధిత వార్తలు: