ఎవడు చెప్పాడ్రా మనది ప్రజాస్వామ్యమని.. అంతా ధనస్వామ్యమే.. ఇవిగో లెక్కలు?

దేశ వ్యాప్తంగా ఏడు విడతల్లో సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నాయి. దీంతో మొత్తం సందడి వాతావరణం నెలకొంది. ప్రస్తుతం అక్కడక్కడ నామినేషన్ల పర్వం దిగ్విజయంగా కొనసాగుతోంది. ఈ సందర్భంగా పలు పార్టీల నేతలు నామినేషన్ దాఖలులో భాగంగా అఫిడవిట్ లో తమ ఆస్తులు, అప్పులు, కేసులు, మొదలైన వివరాలు వెల్లడిస్తున్నారు.

ఈ సందర్భంగా ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ సమయంలో రిచ్చెస్ట్ అభ్యర్థుల జాబితా , వారి అప్పులు, కేసులు తదితర విషయాలు ప్రస్తుతం చర్చనీయాంశం అవుతున్నాయి. అయితే ఈ అభ్యర్థులు ప్రకటించిన ఆస్తులపై అసోసియేషన్ ఫర్ డెమెక్రటిక్  రిఫార్మ్స్  అనే సంస్థ పరిశీలన చేసి ఓ జాబితాను విడుదల చేస్తోంది. ఇందులో పలు ఆసక్తికర అంశాలు వెలుగులోకి వచ్చాయి.

పోటీ చేస్తున్న అభ్యర్థులు ఎవరు? వారి సగటు ఆస్తుల విలువ ఎంత? ఇదే సమయంలో గెలుస్తున్న అభ్యర్థుల సగటు ఆస్తుల విలువ ఎంత అనే అంశంపై తాజాగా స్పష్టత ఇచ్చింది. ఈ పరిశీలన చూస్తే ఎన్నికల్లో గెలవాలంటే డబ్బే ప్రధానం అనే అంశం అవగతమువుతుంది. 2004-2019 మధ్య గల లెక్కలను పరిశీలిస్తే.. 2004లో పోటీ చేసిన అభ్యర్థుల ఆస్తుల సగటు రూ.6.20లక్షలు మాత్రమే. కానీ గెలిచిన అభ్యర్థుల ఆస్తుల విలువ 52.2లక్షలు.

2019కి వచ్చే సరికి పోటీ చేస్తున్న అభ్యర్థుల సగటు ఆస్తులు రూ.27లక్షలు. ఇదే సమయంలో గెలిచిన అభ్యర్థులు ఆస్తులు చూసుకుంటే.. దాదాపు రూ.5 కోట్లు. అంటే ఆస్తులు అధికంగా ఉన్న అభ్యర్థులే ఎన్నికల్లో విజయం సాధిస్తున్నారు అన్నమాట. ఆ తర్వాత మరింత ధనవంతులు అవుతున్నారు. పోటీ చేసే సమయంలో ఎంత మంది అభ్యర్థులు బరిలో ఉంటే వారందరనీ కలిపి యావరేజ్ తీస్తారు. ఒకవేళ ఇండిపెండెట్లను తీసేస్తే ఈ లెక్కలు మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ లెక్కలన్నీ చూస్తే ఇండియాలో ప్రజాస్వామ్యం కంటే ధన స్వామ్యమే నడుస్తోందని ఎవరైనా అంగీకరించాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: