మోదీ,అమిత్‌షా: ఆ ఒక్కమాటతో నేషనల్‌ హీరో అయిన రేవంత్‌?

రేవంత్ రెడ్డి.. ఈ పేరు జాతీయ స్థాయిలో ప్రస్తుతం చర్చనీయాంశం అవుతున్న పేరు. వ్యూహమో.. మరేదో తెలియదు కానీ, రిజర్వేషన్లపై కుట్ర జరుగుతుందంటూ బీజేపీకి ఊపిరి ఆడకుండా చేస్తున్నారు తెలంగాణ సీఎం. రిజర్వేషన్లపై రేవంత్ వ్యాఖ్యల పుణ్యమా అని బీజేపీ జాతీయ స్థాయి నేతలు కూడా దీనిపై క్లారిటీ ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది.

రేవంత్ ఆరోపిస్తున్నట్లు గానే బీజేపీ మరోసారి గెలిస్తే రిజర్వేషన్లు రద్దు చేస్తుందా అనేది జాతీయ స్థాయిలో చర్చ మొదలైంది. లోక్ సభ ఎన్నికల ముంగిట బీజేపీని ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ వద్ద బలమైన ఆయుధం లేదనేది విశ్లేషకుల మాట. ప్రజాస్వామ్య పరిరక్షణ పేరిట రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ప్రారంభించినా ఇది పార్టీకి ఆశించిన మైలేజ్ ఇవ్వలేకపోయింది. ఇదే సమయంలో బీజేపీ మాత్రం పదేళ్లలో చేసిన అభివృద్ధిని గురించి చెప్పడం మానేసి.. మతం పేరిట రాజకీయాలు చేస్తూ కాంగ్రెస్ పై విమర్శలు చేయడం మొదలు పెట్టింది.  

మైనార్టీ పేరిట మెజార్టీల మనోభావాలను కాంగ్రెస్ తొక్కి పెట్టిందని తద్వారా హిందువుల ఓట్లను పోలరైజేషన్ కోసం యత్నించింది.  ఈ క్రమంలో బీజేపీకి ముకుతాడు వేసేలా రేవంత్ రిజర్వేషన్ల అంశాన్ని తెరపైకి తీసుకువచ్చి బీజేపీకి షాక్ ఇచ్చారు. ఇప్పుడు దీనిని తిప్పికొట్టేందుకు బీజేపీ ఆపసోపాలు పడుతోంది.

దీంతో పాటు మోదీ, అమిత్ షాలను టార్గెట్ చేస్తూ రేవంత్ విమర్శలు చేయడంతో జాతీయ స్థాయిలో కూడా ఆయన మాటలకు స్పేస్ పెరుగుతుంది. దిల్లీ పోలీసులు వచ్చి సీఎం కు నోటీసులు ఇవ్వడంతో జాతీయ స్థాయి కాంగ్రెస్ లో ఆయనకు ఓ గుర్తింపు లభించినట్లయింది. జడ్పీటీసీ స్థాయి నుంచి అంచెలంచెలుగా సీఎం స్థాయికి ఎదిగిని రేవంత్ రెడ్డి.. ఇప్పుడు జాతీయ రాజకీయాల్లో కూడా తనదైన ముద్ర వేస్తున్నారు. కర్ణాటక, కేరళలో కూడా ప్రచారం చేస్తున్నారు. మొత్తం మీద రేవంత్ జాతీయ స్థాయి నేతగా ఎదుగుతున్నారు అని చెప్పడానికి నిదర్శనం.. ఆయన మాటలకు మోదీ, అమిత్ షాలు స్పందిచడం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: