ఏపీ: సీఎంగా జగనన్న ప్రమాణ స్వీకారం ఆ రోజే.. సంబరాలకి సిద్ధమవ్వండి!

Suma Kallamadi
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు మే 13న పూర్తయ్యాయి. జూన్ 4వ తేదీన ఎన్నికల రిజల్ట్ వెలువడనుంది. ఈసారి రికార్డు స్థాయిలో పోలింగ్ నమోదయింది. 78 % కంటే ఎక్కువగానే ఓట్లు పడ్డాయి. మహిళలు వృద్ధులు పల్లెటూరు వాళ్ళు ఎక్కువగా ఓట్లు వేశారు. పెరిగిన ఈ పోలింగ్ శాతం తమకు బాగా కలిసి వస్తుందని దానికి కారణంగా జగన్ మళ్ళీ అధికారంలోకి వస్తారని వైఎస్ఆర్సీపీ పార్టీ బలంగా నమ్ముతోంది. అంతేకాదు రెండోసారి ప్రమాణ స్వీకారం చేయడానికి జగన్ రెడీ అయ్యారని కూడా వెల్లడించింది. జూన్ 9న విశాఖపట్నంలో రెండోసారి సీఎంగా జగన్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు అని తాజాగా ట్వీట్ చేసింది.
"జూన్ 4న ఓట్ల లెక్కింపు ఉంటుంది, వైఎస్ఆర్సీపీ భారీ విజయాన్ని నమోదు చేయబోతోంది, వైజాగ్ లో రెండోసారి జగనన్న ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. సంబరాలకి సిద్ధమవ్వండి!" అని ఒక ట్వీట్ ద్వారా తాజాగా వైఎస్ఆర్సీపీ ఒక ప్రకటన చేసింది. ఈ ట్వీట్ ప్రస్తుతం వైరల్ గా మారింది. ఏపీ రాజకీయాల్లో ఒక సంచలనంగా కూడా మారింది. చాలామంది జగనన్న నిజంగానే గెలవబోతున్నారని అది మాత్రం కచ్చితంగా చేస్తున్నారు. టీడీపీ మద్దతుదారులు మాత్రం కేసిఆర్ కూడా ఇలాగే తాము హ్యాట్రిక్ హిట్ కొట్టబోతున్నామని ముందుగానే ప్రకటించి తర్వాత నాలుక కరుచుకున్నారు అదే పరిస్థితి వైసీపీకి కూడా వస్తుంది అని ఎద్దేవా చేస్తున్నారు.
గెలిచేవారే అయితే జగన్ లండన్ ఎందుకు పారిపోయారు ఇక ఆయన అడ్మిన్ చోటే పారిపోతారు ఎందుకంటే ఓడిపోతానని తనకు ఆల్రెడీ తెలుసు, ఇదే ఆయనకు చివరి పోటీ అవుతుంది అంటూ మరికొందరు కామెంట్లు పెడుతున్నారు. ఏది ఏమైనా జగన్ ద్వారా లబ్ధి పొందిన ఆడవారు, వృద్ధులు, పల్లెటూరు వాళ్ళు స్కూల్ విద్యార్థుల తల్లిదండ్రులు, చిన్న సన్న కారు వ్యాపారస్తులు, ఆటో డ్రైవర్లు ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది వైసీపీకి ఓట్లు వేసే ఉంటారు. ఎగ్జిట్ పోల్స్‌ ప్రకారం వైసీపీకి 120 + సీట్లు వచ్చే అవకాశం ఉంది. అందువల్ల ఆయన ఓడిపోతారని అంత సులభంగా అనేస్తే సరిపోదు. అలాగని గెలుస్తారని కూడా చెప్పలేం కాబట్టి జూన్ 4 వరకు వెయిట్ చేయాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: