బీజేపీకి కంచుకోటగా ఉన్న ఆ రాష్ట్రం.. ఈసారి మాత్రం తీవ్ర నిరాశే..??

Suma Kallamadi
లోక్‌సభ ఎన్నికలలో 370కి పైగా పార్లమెంటు స్థానాలను గెలుచుకోవాలని బీజేపీ తపన పడుతోంది. ఆ నెంబర్ సాధిస్తే బీజేపీ హ్యాట్రిక్ విజయం సాధించినట్లు అవుతుంది మోడీ ప్రధాని అవుతారు మోదీ కూడా భారతీయ చరిత్రలో మోస్ట్ సక్సెస్‌ఫుల్ ప్రధానిగా నిలిచిపోతారు. కానీ 2019లో ఎక్కువ సీట్లు గెలుచుకున్న కొన్ని రాష్ట్రాల్లో ఇప్పుడు ఆ స్థాయిలో సీట్లు కొలుచుకునే అవకాశాలు లేవని తెలుస్తోంది. ఈ కారణంగా మోడీతో సహా బీజేపీ వాళ్ళందరూ తీవ్రమైన బాధలో భయంతో ఉన్నట్లు తెలుస్తోంది. కేంద్రంలో అధికారంలో ఉండి కూడా బీజేపీ కొన్ని రాష్ట్రాలను ఏమాత్రం పట్టించుకోలేదు. ఆ కారణంగానే బీజేపీపై ఆయా రాష్ట్రాల తీవ్ర అసంతృప్తితో ఉన్నారని తెలుస్తుంది. వారందరూ వ్యతిరేకంగా ఓటు వేయవచ్చు దీనివల్ల చాలా సీట్లు కోల్పోవచ్చు.ముఖ్యంగా హర్యానా రాష్ట్రంలో ఇప్పుడు బీజేపీ పార్లమెంటు స్థానాలను గెలవడం అసాధ్యంగా మారింది. 2014 సార్వత్రిక ఎన్నికలలో హర్యానాలోని 10 స్థానాలలో బీజేపీ ఏడు విన్ అయ్యింది. 2019లో బీజేపీ 10కి 10 స్థానాలను గెలుచుకుంది. కానీ ఇప్పుడు 10 కాదు కదా రెండు, మూడు గెలవడమే కష్టంగా ఉందట.
2019 లోక్‌సభ ఎన్నికలు పూర్తయిన ఆరు నెలలకు ఈ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. అయితే పార్లమెంటు ఎన్నికలలో బీజేపీ 58 శాతం ఓట్లు గెలుచుకోగా అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ సాధించిన ఓటు శాతం 36కి పడిపోయింది. రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవడానికి కావలసిన అసెంబ్లీ సీట్లు కూడా  గెలుచుకోలేకపోయింది. దీని ఫలితంగా జననాయక్ జనతాపార్టీ, ఏడుగురు స్వతంత్రులతో చేతులు కలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే అప్పట్లో తగ్గిన ఓట్లు కవర్ చేసి హర్యానాలో పూర్తి మెజారిటీతో గెలవాలని బీజేపీ అనుకుంది.
కానీ డబుల్ ఇంజన్ సర్కార్ అని గొప్పలు చెప్పుకోవడానికి తప్ప రాష్ట్రం ఏమీ అభివృద్ధి కాలేదని ప్రజలు ఇప్పుడు బీజేపీపై తీవ్ర వ్యతిరేకత చూపిస్తున్నారు. కాంగ్రెస్‌, ఆమ్‌ ఆద్మీ పార్టీ కూటమి బీజేపీ రాష్ట్రానికి ఎంత అన్యాయం చేసిందో చెబుతూ ప్రజలను తమ వైపు సులభంగా తిప్పుకుంటుంది. ఇక రైతు చట్టాలు రైతుల డిమాండ్ల విషయంలో కూడా బీజేపీ ప్రజలకు మంచి చేయలేకపోయింది. వీటితోపాటు బీజేపీ ఎంపీ బ్రిజ్‌భూషణ్‌ శరణ్‌సింగ్‌ లైంగిక వేధింపుల కేసులో చిక్కుకోవడం, అతనికే బీజేపీ టికెట్ ఇవ్వడం వంటివి ప్రజలకు నచ్చలేదు మొత్తం మీద కమలం పార్టీకి ఈ రాష్ట్ర ప్రజలు బాగానే షాక్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

BJP

సంబంధిత వార్తలు: